ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు మమతా బెనర్జీ హవా నడుస్తుంది.సుదీర్ఘకాలం పాటు వెస్ట్ బెంగాల్ ను పరిపాలించిన కమ్యూనిస్టులు ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషించేంత స్థాయిలో కూడా లేకుండాపోయారు.
దీనితో అక్కడ మమతా బెనర్జీకి ఎదురులేకుండా పోయింది.దీనితో అక్కడ ఆమె కాని ఆమె పార్టీ వారు కాని ఏం చేసినా అడిగేవారు లేకుండా పోయారు.
దీనితో అధికారపక్షంలో అవినీతి పెరిగిపోవడం వంటి అంశాలు తలెత్తాయి.వీటిని ప్రజలలోకి తీసుకెళ్లి అక్కడ పాగా వేయడంలో బిజేపి సక్సెస్ అయింది.
దానితో అధికారాన్ని కాపాడుకోవడానికి ఇంతకు ముందు ప్రజలలో తనకున్న పేరును మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మమతా బెనర్జీ ప్రశాంత్ భూషణ్ అందించిన స్ట్రాటజీస్ తో ఈసారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు మాదే అంటూ అటు మమతా బెనర్జీ ఇటు బిజేపి ఇద్దరు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
తాజాగా బిజేపి తృణమూల్ కాంగ్రెస్ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించింది.
ఈ నంబర్ కు కాల్ చేసి తృణమూల్ కాంగ్రెస్ సర్కారు చేసిన చేస్తున్న అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని అలా ప్రజలు చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర స్థాయిలో తాము పోరాడుతామని అలాగే వాటిని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.