రాష్ట్రంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న రాక్షసుడు చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని.

టీడీపీకి బలం,బలహీనత 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడే అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.వాళ్ళు అన్నది అక్షర సత్యం చంద్రబాబు నాయుడు వ్యూహా చతురతకు మహామహులే దెబ్బతిన్నారు.

 Kodali Nani Comments On Cbn, Chandra Babu Naidu, Ysrcp, Capital, Kodali Nani, Ys-TeluguStop.com

అలాంటి బాబు గారి వ్యూహాలు ఫలించినప్పుడు పార్టీ భారీ విజయాలను సాధిస్తుంది.విఫలమైనప్పుడు ఊహించనంత పరాభవాన్ని పార్టీ మూటకట్టుకుంటుంది.

అందులో భాగంగానే 2019 ఎన్నికలలో పార్టీ దారుణ ఓటమిని చూడాల్సి వచ్చింది.

దాని నుండి పార్టీని, పార్టీ క్యాడర్ ను బయటకు తీసుకురావడం కోసం బాబు గారు చాలానే కృషి చేస్తున్నారు.

ఆ ప్రయత్నాలలో అప్పుడప్పుడు పట్టు తప్పి వ్యూహాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించడం వదిలేస్తూ ప్రతి విషయంలో ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు.ఇది రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ, జనసేన కూటమికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ చేస్తున్న తప్పులను తమకు అనుకూలంగా వాడుకోవాలి అనుకుంటున్న వైసిపి తమ నాయకుల చేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యూహాత్మక తప్పులను ప్రజలలోకి తీసుకెళ్లి ఎలా చేస్తున్నారు తాజాగా అందులో భాగంగానే తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొన్ని ఆసక్తికర కామెంట్ చేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను తొలుత దసరా లేదా గాంధీ జయంతి లోపు పూర్తిచేయాలని మంత్రులను అధికారులను, జగన్ ఆదేశించారని కాని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి రాష్ట్రంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న రాక్షసుడు చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడ్డారు అయినప్పటికీ తాము జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు.

జగన్ ఎక్కడ ప్రజలలో దేవుడు అయిపోతాడో అని చంద్రబాబు నాయడు ఇలాంటి కుట్ర కార్యక్రమాలు చేస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube