గత వారం రోజుల క్రితం అమెరికాలో నదికి మధ్యలో నిర్మించిన వంతెనపై నడుస్తూ ఒక వైపు నుండి మరో వైపు వెళ్ళాయి.తాజాగా ఇలాంటి ఘటనే మన దేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాన్నొడ్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ గ్రామం దగ్గర లో ఉన్న హైవేపై ఏకంగా పది అడుగుల పొడవు ఉన్న మొసలి రోడ్డు దాటుతూ కనిపించింది.
ఇలా ఒక్కసారిగా అంత పెద్ద మొసలి రోడ్డుపై దాటుతూ కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పశువులను మేపడానికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఆ మొసలి ని చూసి అక్కడి నుంచి పరారయ్యారు.అయితే ప్రజలు తెలిపిన ప్రకారం… ఆ మొసలి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో కొద్దిసేపు ఉందని, ఆ తర్వాత రోడ్డుపై ట్రాఫిక్ తగ్గిన తర్వాత రోడ్డు ను సాఫీగా దాటిందని తెలిపారు.
ఈ సమయంలో కొందరు మొసలి రోడ్డు దాటడాన్ని వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
ఇలా అంత పెద్ద మొసలి చూసి భయపడిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, అటవీ అధికారులు ఆ మొసలిని పట్టుకొని సమీప చెరువులో వదిలారు.అధికారులు మాట్లాడుతూ… వర్షాకాలం కారణంగా సరసు నుండి ఇలా బయటకు వస్తున్నాయని తెలిపారు.
ఇది వరకు కూడా ఆ గ్రామంలో మొసలి ఇలా బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయని అధికారులు తెలియజేశారు.