మన దేశంలో టెక్నాలజీపై కొంత అవగాహన ఉన్నవాళ్లకు సైతం పేటీఎం గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది.మొదట్లో ఆఫర్ల ద్వారా యువతకు దగ్గరైన పేటీఎం యాప్ కు నోట్ల రద్దు తరువాత డిమాండ్ పెరిగింది.
నగరాల నుంచి పల్లెల వరకు పేటీఎం యాప్ ఎంతో ఫేమస్ అయింది.అయితే తాజాగా పేటీఎం ఇప్పుడు తన పేరును బినోద్ గా మార్చుకుంది.
పేటీఎం బినోద్ పేరు పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది.
బినోద్ అనేది ఒక వ్యక్తి పేరు.
మనం వినోద్ అని పిలిచే పేరును ఉత్తరాది రాష్ట్రాల్లో బినోద్ గా పిలుస్తారు.అయితే ఈ పేరు ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతోంది.
మన దేశంలో ట్విట్టర్ యూజర్లు ఈ పేరును ట్రెండింగ్ లోకి తెచ్చారు.ఈ బినోద్ పేరు తొలుత స్లే పాయింట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ ఛానల్ నిర్వహకులు వాళ్ల యూట్యూబ్ ఛానెళ్ల కింద వచ్చే కామెంట్లపై సెటైర్లు వేస్తూ ‘why indian comments section is garbage ’ అనే వీడియోను పోస్ట్ చేశారు.
యూట్యూబ్ ఛానల్ యాంకర్లు కొందరు వీడియోల కింద అడ్డమైన కామెంట్లు చేస్తూ కామెంట్ సెక్షన్ ను చెత్త కుండీలా తయారు చేస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు.
ఆ వీడియోకు బినోద్ దారు అనే వ్యక్తి కామెంట్లో బినోద్ అని పోస్ట్ చేశాడు.ఆ కామెంట్ కు లైకులు రావడంతో పాటు ఆ తర్వాత ఆ పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అయింది.
ఈ సందర్భంగా గబ్బర్ అనే ట్విట్టర్ యూజర్ పేటీఎం పేరును బినోద్ గా మార్చండని చెప్పగా పేటీఎం సానుకూలంగా ట్విట్టర్ లో పేరును బినోద్ గా మార్చింది.ఈ విధంగా బినోద్ పేరు పాపులర్ అవుతోంది.