“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతమైన కార్యక్రమం అంటున్న మహేష్...!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని నేడు ఫిలింనగర్ లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.మొక్కలు నాటిన అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ.

 Mahesh Babu Green India Challenge, Mahesh Planting Trees On Birthday, Mahesh Bab-TeluguStop.com

ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంతుందో… మొక్కలకి, జంతువులకి కూడా అంతే హక్కు ఉందని అన్నాడు.మనుషులందరూ జీవ జాలాన్ని సమానంగా చూడటమే అసలైన నాగరికత అని అన్నారు పెద్దవారు.

అయితే మనం మాత్రం బిల్డింగ్ కట్టడం, అడవులను నరికి భూమిని నిస్సారం చేసే ఎరువుల్ని వాడుతూ అభివృద్ధి, నాగరికత అనుకుంటుంన్నాం అని తెలిపారు.

ఇలాంటి కారణాలవాలనే ఇన్ని విపత్తులు సంభవిస్తున్నాయని, నా దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటే వృక్షాల ఎదుగుదల కూడా అని నమ్మతాను అని తెలిపారు.

ఇలా ఉంటేనే అప్పుడే మనం విపత్తులు లేకుండా, కరోనాలాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతంగా బ్రతకగలం అని, అయితే ఇవ్వని జరగాలంటే ప్రతీ ఒక్కరు మన జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని, బాధ్యతగా మూడు మొక్కలు నాటాలని సూచించాడు.

అయితే తాను ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పైమందిని కదిలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని అన్నాడు.ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ అనేదానికంటే భవిష్యత్ తరాల మనుగడకు‘ ప్రొటెక్షన్ ప్లాన్ ‘ అంటే ఇంకా బావుంటుందని తాను తెలిపాడు.ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సంతోష్ కుమార్ ని మనసారా అభినందిస్తున్నా, అలాగే వారి కృషికి మద్దతుగా నా అభిమానులందరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరాడు.

ఇక మహేష్ చివరగా ముగ్గురు ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, తమిళ్ నటుడు విజయ్, నటి శృతి హాసన్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube