ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచంలోని ప్రతి దేశం కరోనా వ్యాప్తి అధికం కావడంతో అనేక ఇబ్బందులు పడిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఇక అసలు విషయానికి వస్తే… న్యూజిలాండ్ దేశంలో మాత్రం కరోనా పూర్తిగా కంట్రోల్ అయింది.అవును మీరు విన్నది నిజమే… ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం లో ఒక్క కేసు కూడా లేదు.
అది కూడా ఏకంగా గత 100 రోజుల నుంచి ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మండి.ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అక్కడి వైద్యాధికారులు నేడు తెలియజేశారు.
అయితే కొన్ని రోజుల క్రితం విదేశీయులు వారి దేశాల నుండి రావడంతో వారికి కరోనా పరీక్షలు చేయగా వారికీ కరోనా పాజిటివ్ అని తేలింది.అయితే వారందరూ విదేశీయులు కావడంతో గత 100 రోజుల నుండి ఒక్క కేసు కూడా వారి దేశంలో నమోదు అవ్వలేదని తెలియజేశారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తిగా క్వారంటైన్ చేస్తున్నట్లు ఆరోగ్య అధికారులు తెలియజేశారు.
నిజంగా 100 రోజుల పాటు ఒక కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గొప్ప విషయమే.అయితే కరోనా మహమ్మారి ఫిబ్రవరి నెలలో న్యూజిలాండ్ లో 1219 కేసులు ఉండగా… ఆ సమయంలోనే పూర్తిగా లాక్ డౌన్ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడంతో పూర్తిగా కరోనా వ్యాధి తగ్గిపోయింది.అయినా 50 లక్షలు జనాభా ఉన్న న్యూజిలాండ్ దేశంలో ఇలా చేయడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే.
ఆ దేశంకి ఎవరైనా విదేశీయులు వస్తే వారందరు 14 రోజులపాటు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉంటేనే వారికి అనుమతి ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు.అందుకే ఆ దేశంలో కరోనా పూర్తిగా కంట్రోల్ లో ఉంది.
దీంతో ఆ దేశం ఇప్పుడు ప్రపంచం దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.