అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ పై ఆయన సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ రాసిన టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్ అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మేరీ ట్రంప్ ఈ పుస్తకాన్ని రాసినట్టుగా, కొన్ని రోజుల క్రితమే ప్రకటించగా అదే సమయంలో ట్రంప్ వ్యక్తిత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అమెరికా ప్రజలని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అంతేకాదు ఆమె మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఎంత చీటర్, ఎలాంటి బుద్ది కలవాడో నేను పుస్తకం రాశానని చెప్పగానే ఆ పుస్తకంపై అంచనాలు పెరిగిపోయాయి.
అయితే మేరీ ట్రంప్ విడుదల చేసిన ఈ పుస్తకానికి ఊహించని విధంగా భారీ డిమాండ్ పెరిగిపోయింది.
అంతేకాదు ఒక్కరోజులోనే సుమారు 10లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.ఈ విషయాన్ని పుస్తకం ప్రచురించిన పబ్లిషర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఎన్నికలు దగ్గపడుతున్న సమయంలో ట్రంప్ పై విమర్శలు చేస్తూ ఇలా పుస్తకం విడుదల అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్ లే లక్షల్లో ఉన్నాయని ప్రచురించిన కంపెనీ పేర్కొంది.

ఇదిలాఉంటే ఈ పుస్తకం మార్కెట్ లోకి రాకుండా నిలిపివేయాలని ట్రంప్ రెండవ అన్న రాబర్ట్ కోర్టును ఆశ్రయించిన ఉపయోగం లేకుండా పోయింది.ఆస్తుల పంపకాల ఒప్పందం మేరీ ఉల్లంఘంచినందుకు ఆమె పుస్తకం మార్కెట్ లోకి రాకూడదని, ఇదంతా రాజకీయ కుట్రగా కోర్టులో వాదనలు జరిగినా మేరీ ట్రంప్ కి అనుకూలంగా తీర్పు రావడంతో ట్రంప్ వర్గం షాక్ అయ్యింది.ప్రస్తుతం ఈ పుస్తకం అమెజాన్ సేల్స్ చార్ట్ లో టాప్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది.