మాములుగా సెలబ్రెటీల గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో చిన్న తప్పులు దొర్లినా నెటిజన్లు మాత్రం వారిని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తుంటారు. ఒకవేళ అప్పటికప్పుడు తప్పు జరిగినట్లు గమనించి సరిజేసుకున్నా కొంతమంది స్క్రీన్ షాట్లు తీసుకుని మరీ ట్రోల్స్ చేస్తుంటారు.
సరిగ్గా రచయిత శోభ డే కూడా ఇలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే ఇటీవలే ప్రముఖ నటుడు మరియు హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా గుండె పోటుతో అనుకోకుండా మృతి సంగతి తెలిసిందే.
దీంతో పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా మాధ్యమాలలో సంతాపం తెలియజేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.ఇందులో భాగంగా ప్రముఖ రచయిత్రి శోభ డే కూడా చిరంజీవి సర్జా కుటుంభ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
కానీ ఈ పోస్ట్ కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫోటోని జత చేసింది.అయితే వెంటనే తప్పిదం జరిగినట్లు గ్రహించి చిరంజీవి ఫోటో తొలగించినప్పటికీ కొంతమంది అప్పటికే కొంతమంది స్రీన్ తీసి ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే ఈ విషయంపై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ తాగిన మైకంలో పోస్టులు చేస్తే ఇలాగే ఉంటుందంటూ కొందరు తెగ కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం ఒక రచయిత్రిగా ఉండి ఇలాంటి తప్పిదాలు చేయడం సరి కాదంటున్నారు.