ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తనదైన వీడియోలు తీస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.కాగా ప్రస్తుతం టిక్‌టాక్‌లో వరుసబెట్టి వీడియోలను పోస్ట్ చేస్తూ టాలీవుడ్ జనాలను అలరిస్తున్నాడు.
ఇందులో భాగంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర పాటలను అదే పనిగా వాడుతూ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో వార్నర్ బాగా మెప్పించాడు.
కాగా తాజాగా తాను టిక్‌టాక్‌లో చేసిన వీడియోలను మాషప్‌గా చేసి అల వైకుంఠపురములోని ‘రాములో రాములా’ పాటను వాడుకున్నాడు.
ఈ క్రమంలో ఈ మాషప్‌కు పర్ఫెక్ట్‌గా రాములో రాములా పాట సింక్ కావడంతో ప్రేక్షకులను ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.ఇక తన వీడియోలను ఆదరిస్తున్న వారందరికీ వార్నర్ పెద్ద థ్యాంక్ యూ అంటున్నాడు.
తన భార్య, పిల్లలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వార్నర్ అతి తక్కువ సమయంలోనే అదిరిపోయే ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇక వార్నర్ వీడియోలకు పలువురు సెలబ్రిటీలు సైతం డ్యూయెట్‌లు చేస్తూ మెప్పిస్తున్నారు.
ఏదేమైనా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములోని పాటలు ఏదో ఒక రకంగా తమను ఇంకా అలరిస్తున్నాయని బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈయేడు సూపర్ హిట్ సాంగ్స్‌గా అల వైకుంఠపురములోని పాటలు నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా థమన్ అందించిన సంగీతం సూపర్ సక్సెస్ అందుకుంది.