కృష్ణుడి గెటప్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించినటువంటి అ.ఆ అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా  నటించి మెప్పించినటువంటి కోలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ అమ్మడు గ్లామర్ పరంగా తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు చేయడంతో పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలను కోల్పోయింది.

 Anupama Parameswaran, Tollywood Heroine, Childhood Photo, Little Krishna, A Aa,-TeluguStop.com

అయినప్పటికీ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటోంది.

అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ తన చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేసుకొని తీయించుకున్న ఫోటో.అయితే ఈ ఫోటోని అనుపమ పరమేశ్వరన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన మూడు గంటల లోపే దాదాపుగా 2 లక్షల 60 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అనుపమ పరమేశ్వర్ కి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అని.అయితే మరి కొంతమంది అభిమానులు మాత్రం ఈ ఫోటోకి చిన్నప్పుడు కృష్ణుడు వేషంలో భలే ముద్దుగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Aa, Childhood, Krishna, Nitin, Tollywood-Movie

అయితే చివరిగా ఈ అమ్మడు తెలుగులో బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్ హీరోగా నటించినటువంటి “రాక్షసుడు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం తెలుగులో ఎటువంటి కొత్త అవకాశాలు లేవు.

కానీ తమిళంలో మాత్రం “తల్లి పొగతే’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆర్.

కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube