ప్రస్తుతం టాలీవుడ్ లో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ చిత్రం ముంబై నగర పరిసర ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.ఇటీవలే హీరోయిన్ అనన్య పాండే కూడా తరచుగా షూటింగ్లో పాల్గొంటోంది.
అయితే తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ అనన్య పాండే ఒ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి అని అంటోంది ఈ అమ్మడు.అంతేగాక చాలా సింపుల్ మరియు స్మార్ట్ గా ఉంటాడని కూడా కితాబిచ్చింది.అయితే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన టువంటి అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూశాను అని అందులో విజయ్ దేవరకొండ చాలా బాగా నటించారని అన్నారు.అలాగే ఒకరు సినిమా లో పోషించిన పాత్రను బట్టి కాకుండా వారి నటనను బట్టి మాత్రమే అంచనా వేయాలని అనన్య అంటోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ బాక్సింగ్ ఫైట్లకి సంబంధించినటువంటి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇటీవల విజయ్ దేవరకొండ నటించినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అవడంతో విజయ్ తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు.మరి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంతవరకు ఈ ఆశలను నెరవేరుస్తాడో చూడాలి.