నాగశౌర్య హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అశ్వథ్థామ.ఈ చిత్రంకు మిశ్రమ స్పందన వచ్చింది.
కొందరు ఈ చిత్రంపై పెదవి విరిస్తే కొందరు పర్వాలేదు చూడవచ్చు అన్నారు.మొత్తానికి ఈ చిత్రంతో నాగశౌర్య మాత్రం లాభాలు దక్కించుకున్నాను అంటున్నాడు.
ఈ చిత్రాన్ని స్వయంగా నాగశౌర్య తల్లి నిర్మించిన విషయం తెల్సిందే.కొడుపై ఉన్న ప్రేమతో ఈ చిత్రాన్ని దాదాపుగా 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది.నాగశౌర్య సినిమా ఎంత హిట్ అయినా కూడా పది కోట్లను మించి వసూళ్లు చేయడం సాధ్యం కాని విషయం.అయినా కూడా కొడుకుపై ప్రేమ మరియు సినిమాపై నమ్మకంతో ఏకంగా అంత బడ్జెట్‌ను పెట్టింది.
సినిమాను విడుదలకు ముందు అయిదు కోట్లకు అమ్మడం జరిగింది.కొన్ని ఏరియాల్లో సొంతంగానే విడుదల చేశారు.
దాంతో బ్రేక్ ఈవెన్‌కు నిర్మాత ఇంకా పది కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది.ఆ మొత్తంను రాబట్టినట్లుగా నాగశౌర్య ప్రకటించాడు.
సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ సక్సెస్ వేడుకలో నాగశౌర్య ప్రకటించాడు.ఈ చిత్రంకు అమ్మ పెట్టిన డబ్బులు మొత్తం వచ్చి లాభాలు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.నాగశౌర్య చెబుతున్న దాని ప్రకారం బయ్యర్లు మరియు నిర్మాత పెట్టుబడి వచ్చిందట.అంటే సినిమాకు ఏకంగా 10 కోట్ల వసూళ్లు నమోదు అయ్యి ఉండాలి.కాని ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 6 కోట్ల షేర్ వచ్చింది, నాలుగు కోట్ల ఇతర రైట్స్ రూపంలో వచ్చాయి.కనుక ఇంకా అయిదు కోట్ల లాస్‌లోనే ఈ చిత్ర నిర్మాతలు ఉండి ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి అసలు విషయం ఏంటీ అనేది వారికే తెలియాలి.