జనసేన పార్టీలో అలుముకున్న అసంతృప్తులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.ముఖ్యంగా ఆయన వ్యవహార శైలిపై విమర్శలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
పవన్ ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అదే అలుసుగా తీసుకుని ఆయన పార్టీలో ఇతర నేతలపై పెత్తనం చేయడం ఇవన్నీ ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులకు ఆగ్రహం కలిగిస్తోంది.పవన్ కలిసేందుకు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు సైతం ముందుగా నాదెండ్ల మనోహర్ అనుమతి తీసుకునే వరకు జనసేనలో పరిస్థితి వెళ్లిందట.
ఆయనకు చెప్పకుండా ఎవరు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారట.ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే చాలామంది పార్టీ నాయకులు ఇదే అసంతృప్తితో బయటకు వెళ్లిపోయారట.
కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పార్టీ సిద్ధాంతకర్త రాజు రవి తేజ, తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వీరంతా పార్టీకి ఇలా దూరం అవ్వడం వెనుక కారణాలు కూడా ఇవేనట.
పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులంతా పవన్ పైన, నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలి పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.అసలు జనసేన లో ఈ పరిస్థితి రావడానికి కారణం నాదెండ్ల మనోహర్ అన్నట్టుగా చాలా మంది మండిపడుతున్నారు.
చాలా విషయాల్లో పవన్ ను తప్పుదారి పట్టించి అభాసుపాలు చేయడంలో నాదెండ్ల మనోహర్ పాత్ర ఎక్కువగా ఉంది అంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా నాదెండ్ల మనోహర్ పై గుర్రుగా ఉన్నారు.ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనను నాదెండ్ల మనోహర్ దూరం పెట్టారని, అందుకే ఆయన వైసీపీ కి దగ్గరగా వెళ్లినట్టు తెలుస్తోంది.జనసేన పార్టీని రాపాక లెక్కచేయకపోవడానికి కారణం నాదెండ్ల మనోహర్ కారణం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
రాపాక పవన్ ను కలిసేందుకు ప్రయత్నించినా పవన్ ను కలవకుండా అడ్డుకున్నారని, ఆ కారణంతోనే రాపాక ఇలా జనసేన కు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.దళిత ఎమ్మెల్యే నైనా తన పట్ల దురుసుగా వ్యవహరిస్తూ , నా గౌరవ మర్యాదలను మంట కలుపుతున్నారు అని రాపాక బాధపడుతున్నారట.
ఇక రాజు రవితేజ కూడా ఇదే వైఖరితో బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ఇంకా అనేక మంది నాయకులు నాదెండ్ల మనోహర్ పై అసంతృప్తితో ఉన్నారు.
ఈ విషయాలు పవన్ వరకు వెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని, తమ బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియడంలేదు అంటూ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.