భీష్మకు గుమ్మడికాయ కొట్టేసిన నితిన్

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీష్మ’ షూటింగ్ గతకొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్, ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

 Venu Kudumula Nithin Rashmika-TeluguStop.com

ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోండగా, ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను నితిన్ ముగించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

నితిన్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ కూడా చేశాడు.ఈ సినిమా షూటింగ్ ముగిసినందుకు చాలా బాధగా ఉందని, కానీ ఇలాంటి సినిమాలో నటించినందుకు తాను సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.

వేణు కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నితిన్ ధీమా వ్యక్తం చేశాడు.

అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాను సూర్యదేవరి నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండగా మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాతో నితిన్ హిట్ కొడతాడా లేడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube