సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మరికొన్ని గంటల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మహేష్ బాబు బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడటం ఖాయమని చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో మహేష్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.
ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా తీర్చిదిద్దిన దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మహేష్ బాబు తాజాగా ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ, అనిల్ రావిపూడి దర్శకత్వంపై తనకు మొదట్నుండీ మంచి నమ్మకం ఉందని అన్నారు.అంతేగాక సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు తనకు బాగా నచ్చిందని, ఆయన దగ్గర ఇప్పుడు మరో కథ రెడీ ఉందంటే ఆయనతో వెంటనే మరో సినిమా చేసేందుకు నేను రెడీ అని మహేష్ అన్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంపై మహేష్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడంటే ఈ సినిమాలో అంత మ్యాటర్ ఏముందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.ఇక ఈ సినిమాలో మహేష్ ఓ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తోండగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఇన్ని అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.