కొద్ది రోజుల క్రితం ఎస్వీఎస్సి భక్తి చానల్ చైర్మన్, వైసీపీ పార్టీ నాయకుడు, కమెడియన్ పృధ్వీ రాజధాని ఆందోళన మీద తీవ్రంగా స్పందించారు.అసలు అమరావతిలో ధర్నా చేస్తున్న అందరూ కూడా టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ లే అని, అక్కడ రైతులు లేరని అన్నారు.
అదే సమయంలో రైతులు మట్టిలో పని చేసుకొని గండి తినేవాళ్ళని, వాళ్ళు ఆడీ కార్లులో రారని, స్మార్ట్ ఫోన్ లు పట్టుకొని తిరగరాని కాస్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.ఇక పృథ్వి వ్యాఖ్యల మీద పోసాని కృష్ణ మురళీ సీరియస్ గా స్పందించారు.
రైతులని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ లు ఎలా అంటారని, రైతులకి కార్లు ఉండకూడదా, ఫోన్ లో ఉండకూడదా అంటూ పృధ్వీ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు.పృధ్వీ లాంటి వారు జగన్ ఇమేజ్ దెబ్బ తింటుందని, ఆ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని అన్నారు.
ఇదిలా ఉంటే పోసాని విమర్శల మీద పృధ్వీ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు.రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు పోసాని ఎందుకు స్పందించలేదు.తనకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు.పార్టీ స్టాండ్ కి కట్టుబడే నేను మాట్లాడాను.
ఎవరో ఏదో మాట్లాడితే నేను వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.నా వల్ల పార్టీ నష్టపోతుందని పోసాని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అతనికి దమ్ముంటే ఏదైనా వేదిక ద్వారా మాట్లాడాలి.తాను వ్యవసాయం చేసే రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని ఎక్కడా అనలేదు.
అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారు మాత్రం కచ్చితంగా పెయిడ్ ఆర్టిస్టులే.వారిలో చాలా మంది నాతో నటించినవారు ఉన్నారు.
అది కేవలం బాబు ఆడిస్తున్న డ్రామా అని విమర్శలు చేశారు.మరి పృధ్వీ వ్యాఖ్యల మీద పోసాని ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.