పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న గాడిద పంచాయితీ

పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులను ఎలా చేధించాలా అని పోలీసులు నానా తంటాలు పడుతుంటారు.అయితే వారు కొన్ని కేసులు చేధించడంలో విజయం సాధిస్తే, మరికొన్ని కేసులు మాత్రం చేధించలేకపోతారు.

 Ownership Of Donkeys Issuelands In Policestation-TeluguStop.com

దీంతో అవి పెండింగ్‌లోనే ఉండిపోతాయి.కానీ వికారాబాద్ పోలీసులకు ఓ పెద్ద తలనొప్పి కేసు వచ్చి పడటంతో వారు ఏం చేయాలో అర్ధంగాక తలలు పట్టుకున్నారు.

రామయ్యగూడకు చెందిన బాణాల ప్రభు గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అతడి వద్ద 22 గాడిదలు ఉన్నాయి.కాగా ఇటీవల అందులో నుండి 4 గాడిదలు తప్పిపోయినట్లు అతడు వాపోయాడు.ఇదే విషయాన్ని పోలీసులకు కూడా తెలిపాడు.

గాడిదలు దొరికితే చెబుతాం అని పోలీసులు అతడిని పంపించారు.కాగా మోమిన్‌పేటలోని ఓ వ్యక్తి వద్ద తన రెండు గాడిదలు ఉన్నాయని తెలుసుకున్న ప్రభు అతడితో గొడవకు దిగాడు.

కానీ అవి తనవే అంటూ సదరు వ్యక్తి చెబుతున్నాడు.

దీంతో ఈ పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది.

ఆ గాడిదలు ఎవరివో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.విచారణ జరిపిన తరువాత చెబుతాం అంటూ అక్కడి నుండి గాడిద యజమాని, ప్రభులను పంపించేశారు.

మనుష్యులనైతే గుర్తుపట్టవచ్చు కానీ గాడిదలు ఎవరివో ఎలా తెలుసుకోవడం అనేది ఇప్పుడు పెద్ద చిక్కప్రశ్నగా మారింది.మరి ఈ గాడిదల కేసును వారు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube