లేట్‌ అయ్యిందని పెళ్లి క్యాన్సిల్‌ చేసిన పెళ్లి కూతురు, అసలు కారణం వేరే ఉందంటున్న బంధువులు

మనం పీఠల మీద పెళ్లి ఆగిపోయింది అంటూ వార్తల్లో చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం.పెళ్లి ఆగిపోవడానికి చాలా చాలా కారణాలు ఇప్పటి వరకు మనం చూశాం.

 Marriage Stop For Very Different Reason In Uttarapradesh-TeluguStop.com

ప్రేమ వ్యవహారాలు… అబ్బాయికి ఇంకో పెళ్లి అవ్వడం.అమ్మాయి విషయంలో గొడవలు ఇలా రకరకాల కారణాలు మనం విన్నాం.

కాని మొదటి సారి ఒక వింత కారణంతో ఆగిపోయిన పెళ్లి గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం.ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో పెళ్లి ఇలా ఆగడం మొదటి సారి అయ్యి ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఈ సంఘటన మీకు నవ్వు తెప్పిస్తుంది.

Telugu Jith Distict, Uttarapradesh, Telugu General, Telugu, Uttarpradesh-

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్‌నోర్‌ జిల్లా నంగల్‌ జిత్తు గ్రామానికి చెందిన అమ్మాయిని అదే ప్రాంతంకు చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అంతా సిద్దం అయ్యింది.పెళ్లికి ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి.

పెళ్లి రోజు రానే వచ్చింది.మద్యాహ్నం 2 గంటలకు పెళ్లి ముహూర్తం.12 గంటల వరకు అమ్మాయి ఇంటికి వరుడు రావాల్సి ఉంది.కాని రాలేదు.పెళ్లి సమయంకు వస్తాడులే అనుకుంటే 2 అయ్యింది ఇంకా రాలేదు.3.4.5… ఇలా గంటలు గడిచి పోయినా రాలేదు.వెయిట్‌ చేయగా చేయగా సాయంత్రం 5.30 కు పెళ్లి మండపంకు చేరుకున్నాడు.

Telugu Jith Distict, Uttarapradesh, Telugu General, Telugu, Uttarpradesh-

పెళ్లి భరాత్‌ చాలా మెల్లగా సాగడంతో ఆలస్యం అయ్యిందంటూ ఆ పెళ్లి పిల్లవాడి బంధువులు చెప్పుకొచ్చారు.కాని పెళ్లి కూతురు మాత్రం వారి వివరణ పట్టించుకోలేదు.తనకు అతడు వద్దే వద్దు అంటూ తేల్చి చెప్పింది.అమ్మాయి తరపు వారు ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా ఒప్పుకోలేదు.దాంతో చేసేది లేక పెళ్లి క్యాన్సిల్‌ చేశారు.పెళ్లి క్యాన్సిల్‌ అయిన తెల్లారే ఆ అమ్మాయి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది.

Telugu Jith Distict, Uttarapradesh, Telugu General, Telugu, Uttarpradesh-

మరో వైపు అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమను బంధించి పెళ్లికి టైంకు రాకుండా చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.తమ వద్ద నుండి విలువైన వస్తువులను లాక్కున్నారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే పోలీసులు ఈ వివాదంను రాజీ కుదిర్చి పంపించారు.ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంకు కారణం ప్రేమ అంటూ స్థానికులు చెబుతున్నారు.అలాగే ఆమె ప్రేమించిన యువకుడి స్నేహితులు పెళ్లి కొడుకును బంధించి ఉంటారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తంగా ఈ పెళ్లి చిత్ర విచిత్రంగా ఆగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube