అయోద్యలో రామ మందిరం కేవలం మోడీతోనే సాధ్యం

చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు దాట వేస్తూ వస్తున్న అయోద్య రామమందిరం కేవలం ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యం అంటూ శివసేన అధినేత ఉద్దవ్‌ ధాక్రే అన్నారు.నేడు ముంబయిలో మూడు మెట్రో రైల్వే లైన్‌లకు శంకుస్థాపన జరిగింది.

 Uddhavthakre Commentson Ayyodyarama Mandhiram Modi-TeluguStop.com

ఈ కార్యక్రమంకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు బీజేపీ నాయకులు మరియు శివసేన నాయకులు హాజరు అయ్యారు.ఈ సందర్బంగా శివసేన చీప్‌ ఉద్దవ్‌ థాక్రే మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు.

దేశ అభివృద్ది మోడీతో సాధ్యం అంటూ ఉద్దవ్‌ ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు.</br>

ఇదే సమయంలో అయోద్య రామమందిర నిర్మాణం చేపట్టగల సత్తా కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.

రాబోయే కాలంలో అయోద్యలో రామ మందిరం నిర్మాణం ఖాయం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.కశ్మీర్‌తో పాటు ఎన్నో ఛారిత్రాత్మక నిర్ణయలను తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే రామమందిరం నిర్మాణం జరుగుతుందని తాము అంతా భావిస్తున్నట్లుగా ఈ సందర్బంగా ఉద్దవ్‌ ధాక్రే అన్నాడు.

గత పదుల సంవత్సరాలుగా అయోద్య రామమందిరం విషయం మరుగున పడుతూనే ఉంది.మరి మోడీ రెండవ సారి పీఎం అయిన ఈ సందర్బంగా అయినా రామ మందిరం విషయం ఒక అడుగు ముందుకు పడుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube