కాలిఫోర్నియాలో ఆ ప్రాంతం బిజే బిజీగా ఉంటుంది.పైగా చాలా ప్రమాదకరమైన, లోతైన ప్రాంతంగా అక్కడ పేరు కూడా ఉంది.
ఆ మార్గం ద్వారా వెళ్తున్న ఓ కారు అనుకోకుండా అదుపుతప్పి లోయలో పడింది.ఆ లోయ లోతు 500 అడుగులు కావడంతో కారు పడీ పడగానే కారు భాగాలన్నీ చెల్లాచెదురు అయిపోయాయి.
కారు ఇంజిన్ ఎక్కడో పడిందని, ఆ భాగాలన్నీ ఎక్కడెక్కడ పడ్డాయో కూడా తెలియలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.వెంటనే పోలీసులకి సమాచారం అందించగా హుటాహుటిన వచ్చిన వారు హెలికాప్టర్ సాయంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
లోయలోకి దిగి కారులో చూడగా కారులో డ్రైవ్ చేస్తున్న ఒక్కడే ఉన్నాడని ఎవరూ లేరని తెలిపారు.అయితే ఘటన స్థలంలోనే అతడు చనిపోయాడని పోలీసులు తెలిపారు.
అతడి మృతదేహాన్ని హెలికాప్టర్ సాయంతో కొండపైకి తీసుకువచ్చారు.కారులో దొరికిన కొన్ని ఆధారాలతో అతడెవరో గుర్తిస్తున్నామని.వివరాలు తెలియగానే అతడి కుటుంభ సభ్యులకి తెలుపుతామని పోలీసులు తెలిపారు.అయితే ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణంగా ఈ ప్రమాదం జరిగిందా దర్యాప్తు చెస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.