అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంతో తన రెండేళ్ళ కాలంలో ఎంతో గొప్ప పాలనని అందించారని, అమెరికా ప్రజలు ట్రంప్ పాలన విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారని వైట్ హౌస్ ప్రకటనలో తెలిపింది.ఎన్నో చారిత్రాత్మక ఫలితాలు కేవలం ఈ రెండేళ్ళ కాలంలో సాధించడం ఎంతో గొప్ప విజయమని ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికాని ఆర్ధికంగా ముందుకు తీసుకు వెళ్ళారని దాదాపు.
50లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు, చైనా అనుసరిస్తున్న విలువలు లేని వాణిజ్య విధానాలను కూడా ట్రంప్ పక్కన పెట్టారని తెలిపింది.వృద్ధి అనుకూల విధానాల ద్వారా అమెరికా ఆర్థిక ప్రగతికి ట్రంప్ బలమైన బాటలు వేశారని, ఉపాధి అవకాశాలను ముమ్మరం చేశారని తెలిపింది.ఇదిలాఉంటే ట్రంప్ ఈ కాలంలో సాధించిన విజయాల విషయాన్ని పక్కన పెడితే
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండేళ్ల కాలంలో తీవ్రమైన స్థాయిలో దేశీయ పార్టీల మధ్య గొడవలు హెచ్చు మీరాయి.గడిచిన నెలరోజుల కాలంగా రిపబ్లికన్ ,డెమోక్రాటిక్ పార్టీల మధ్య జరుగుతున్న గోడ గొడవ ఇందుకు నిదర్సనం.అయితే వైట్ హౌస్ కేవలం విజయాల్ని హైలెట్ చేసి చూపించింది కానీ, గోడ గొడవ , వలసల విధానంలో చిన్నారుల విషయంలో ట్రంప్ వైఖరి , ఇలాంటి వివాదాల జోలికి పోకపోవడం గమనార్హం.