తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఏపీ లో రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలపై సీనీ నటుడు ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తరువాత మాట్లాడిన నారాయణ మూర్తి … నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పాలన చూసి ప్రజలు టీఆర్ఎస్‌కు 88 సీట్లు ఇచ్చారని.ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందన్నారు.ప్రజలకు అమోఘమైన పాలన అదించాలని కేసీఆర్ ను కోరానన్న నారాయణమూర్తి… తెలంగాణను భారతదేశంలో నంబర్ వన్ చేయాలని కోరానని… దేశంలో ఉత్తర భారతం పెత్తనం పెరిగింది.
దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ సేవలు అవసరం అన్నారు.కేసీఆర్ పరిపాలన అందరికి నచ్చిందని … ఆయన్ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.