తెలంగాణ మహాకూటమిలోని పార్టీల మధ్య పొత్తు గొడవ సర్దుమణిగి అంతా ఒకే అయ్యింది అనుకుంటున్నా సమయంలో ఆ కూటమిలో ఉన్న టీడీపీకి గట్టి షాక్ తగిలింది.కూటమి పొత్తుల్లో భాగంగా… టీడీపీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్నిదక్కించుకుంది.అక్కడ టీడీపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి పోటీలో ఉన్నారు.అయితే… తాజాగా… ఆయన మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సామ రంగారెడ్డిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది.మాదాపూర్‌లో కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ సంతకాలతో కాజేసినట్టు వ్యాపారి లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు.నాంపల్లి సబ్‌రిజిస్టార్ ఆఫీసులో ఫోర్జరీ చేసినట్టు ఫిర్యాదులో వివరించారు.
తాజా వార్తలు