తెలంగాణాలో ఆయనే సీఎం ! తేల్చి చెప్పిన ఆ సర్వే

సర్వేల సందడి అనేది ఎన్నికల సీజన్ లో సర్వ సాధారణం ! పార్టీల పరిస్థితి ఏంటి.? పార్టీల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.? ఏ పార్టీ గెలవబోతోంది.? ఎన్ని సీట్లు వస్తాయి .? ఏ పార్టీ కి ఏ ప్రాంతంలో పట్టు ఉంది అనేది సర్వే సంస్థలు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సమాచారం సేకరించి మరీ తమ నివేదికలను బయటపెడుతుంటాయి.అయితే స్వతంత్రంగా సర్వే చేసే సంస్థలు … పార్టీలు తమ పార్టీ పరిస్థితి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు…? ఎన్ని సీట్లు వస్తాయి.? ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది.? ఇలా సర్వేలు చేయించుకుంటుంటాయి.అయితే.కొన్ని పేరున్న సంస్థలు మాత్రం వివిధ కోణాల్లో సర్వే లు చేస్తూ… తమ గొప్పతనాన్ని చాటుకుంటూ ఉంటాయి.

 Kcr Is The Next Cm Of Telangana State-TeluguStop.com

అనేక మంది నాయకులు ఇప్పటికీ సర్వేలను నమ్ముతుంటారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణాలో కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఇండియాటుడే నిర్వహిస్తున్న ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (పీఎస్‌ఈ)’ అంచనా వేసింది.వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల కొద్ది నెలలు ముందుగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి.ఈ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లో ఫోన్‌ ద్వారా ఓటర్లను సర్వే చేసిన పీఎస్‌ఈ.

వెల్లడైన అంశాలను ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల వారీగా వివరించింది.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ఈ సర్వేలు ద్వారా తేలిందట.

ఈ సర్వేల్లో తేలింది ఏంటంటే.? టీఆర్ఎస్ కు 75 శాతం ఓటర్లు మద్దతిస్తున్నట్లు అంచనా.ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పాలనకు సానుకూల పవనాలు వీస్తున్నాయనీ.అన్నివర్గాల ప్రజల్లోనూ టీఆర్ఎస్ కు ఆదరణ కనిపిస్తోందని సర్వే తెలిపింది.అంతే కాదు రాష్ట్రంలో అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ పథకాలు అదనపు బలంగా నిలిచాయనీ…అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ రాజకీయ గొప్ప ఎత్తుగడగా అభివర్ణించింది పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి సర్వే.కాంగ్రెస్‌-తెదేపాల పొత్తు సానుకూల ఫలితాలిచ్చే పరిస్థితి అంతగా కనిపించడం లేదనీ.

హైదరాబాద్‌ ప్రాంతంలో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమి ఓట్లకు గండికొట్టే అవకాశం వుందనీ పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి సర్వే తేల్చేయడంతో టీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ అధికారం దక్కడం ఖాయం అనే విషయం అర్ధం అయిపోతోంది.అయితే ఈ సర్వే ఫలితాలను ఎంతవరకు నమ్మవచ్చు అనేది మాత్రం తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube