మోడీ గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన సమయంలో తెలుగువారంటే నాకెంతో అభిమానం మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించుకుంటూ.అభిమానిస్తూ ఉంటాను, మీ అభివృద్ధి తప్పకుండా కృషి చేస్తాను అంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఏపీ పై అపారమైన ప్రేమ ఉన్న వాడిలా మోడీ పెద్ద నాటకం ఆడారు.విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఏర్పడిన సమయంలో ఏపీకి వచ్చిన మోడీ ఢిల్లీ నుంచి మట్టి నీళ్లు మాత్రమే తీసుకువచ్చారు పాపం అప్పుడు మనం ఏపీ ప్రజలకు అర్థం కాలేదు చివర్లో అవే తెలుగోడి నోళ్లలో కొడతారని…
ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తెలుగు ప్రజలపై ఏపీ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తూ వస్తున్న బిజెపి పార్టీ మరోసారి తెలుగును, తెలుగు జాతిని గుజరాత్ సాక్షిగా అవమానించింది.ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలుగు వారిపై చూపిస్తున్న వివక్ష కారణంగా తన మనసు క్షోభిస్తోందని బాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు.అయితే బాబు ఎందుకు ఇంతలా మోడీ పై ఫైర్ అయ్యారు అంటే.గుజరాత్ లో కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన విషయం విధితమే అయితే ఆ విగ్రహం ఏర్పాటు సమయంలో అక్కడి శిలాఫలకంపై అన్ని భాషల్లోనూ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని రాశారు అయితే.
భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష మూడవ స్థానంలో ఉండగా ఎంతోమంది తెలుగును గౌరవిస్తారు కానీ ఎంతో ప్రాచుర్యం ఉన్న తెలుగు బాషకి ఆ శిలాఫలకంపై తెలుగు భాషకి స్థానం లేకపోవడం తెలుగు వారందరినీ, తెలుగు తల్లిని , కించపరిచిన ట్టేనని, తెలుగువాడిగా అక్కడ తెలుగులో పేరు లేకపోవడం ఎంతగానో బాధిస్తోందని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని కడిగేశారు.ప్రతి తెలుగు వారు ఈ విషయంపై తప్పకుండా స్పందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అంతేకాదు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చక పోయినా సరే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి శ్రమిస్తున్నాం, బిజెపి మ్యానిఫెస్టో తో పాటు ఎన్నికల సభలో నరేంద్ర మోడీ ఇస్తానని ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎదురు దాడి చేసిన భరిస్తున్నాం ,సహిస్తున్నాం లక్ష్యం కోసం పోరాడుతూనే ఉంటాం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.అయితే చంద్రబాబు లేవనెత్తి ఈ అంశం పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.మోడీ ఇదేనా మీరు తెలుగు బాషకి తెలుగువారికి ఇచ్చే గౌరవం అంటూ ఫైర్ అవుతున్నారు.