తెలంగాణ ఎన్నికల్లో నారా వారి కోడలు

ఎన్నికల వేడి తెలంగాణలో బాగా రాజుకుంది.పార్టీల మధ్య చిత్ర విచిత్రమైన పొత్తులు బయలుదేరాయి.

 Nara Brahmani Participating In 2019 Elections From Kukatpally-TeluguStop.com

బద్ద శత్రువులు కూడా ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు.ఇప్పటివరకు కాంగ్రెస్ ని ప్రత్యర్ధి పార్టీగా టీడీపీ చూసింది తప్ప కాంగ్రెస్ తో చెలిమిని ఎవరూ ఊహించలేదు.

అయితే రాజకీయ కారణాల దృష్ట్యా టీడీపీ ని తెలంగాణలో బ్రతికించుకోవాలి అంటే తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టక తప్పని పరిస్థితి.అయితే ఇంకా కాంగ్రెస్ తో సీట్ల లొల్లి తేలని కారణంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో లేదో తెలియదు కానీ టీడీపీ అధినాయకత్వం మాత్రం తాము బలంగా ఉన్న స్థానాలలో టీడీపీ తరపున అభ్యర్థులు రంగంలోకి దిగేలా ప్లాన్ వేసుకుంది.

ఈ విధంగానే ఆంద్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండే కూకట్ పల్లి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తమకి కావాలని ముందుగానే కాంగ్రెస్ కి షరతు కూడా పెట్టిందట.కూకట్ పల్లి స్థానంలో అధికశాతం మంది ఆంధ్రా ఓట్లు ఉండటంతో టీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వాలంటే తప్పకుండా టీడీపీ నుంచీ పోటీ ఉండాలని కాంగ్రెస్ కూడా డిసైడ్ అయ్యిందట అందులో భాగంగానే టీడీపీ , కాంగ్రెస్ లు వేగంగా పావులు కదుపుతున్నారు.అయితే గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచీ టీడీపీ తరుపు మాధవరం కృష్ణా రావు పోటీ చేయగా టీఆర్ఎస్ నుంచీ పోటీగా గొట్టిముక్కల పద్మారావు పోటీ పడ్డారు.అయితే అనూహ్యంగా ఆంధ్రా ఓట్లు చంద్రబాబు ని చూసి పడటంతో మాధవరం సైకిల్ దిగి కారు ఎక్కేశారు దాంతో గొట్టిముక్కలకి మాధవరం కి ఉప్పు నిప్పులా మారిపోయింది.

ఇదిలాఉంటే.4.70 లక్షల ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 60 శాతం మంది వలసలు వచ్చిన వాళ్ళే ఉన్నారు…అందులోనూ కోస్తా జిల్లాల ప్రజలు మరీ ఎక్కువ అంతేకాదు కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా అధికంగానే ఉన్నారు.దాంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపు మంచి ఫేం ఉన్నవారిని ఎవరిని దింపినా సరే విజయం తప్పకుండా టీడీపీ నే వరిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.

అయితే ఎప్పటినుంచో తెలంగాణా టీడీపీ నేతల నారా వారి కోడలు బ్రాహ్మణిని తెలంగాణా రాజకీయాల్లోకి దింపమని మేము దగ్గర ఉండి మరీ ఆమె గెలుపు భాద్యతలు చూసుకుంటామని మాట ఇస్తున్నారు.

తమకి ఎంతో బలమైన కూకట్ పల్లి నుంచీ బ్రాహ్మణి ని పోటీ కి దించితే అటు కమ్మసామాజిక వర్గం ఓట్లు ఇటు ఆంధ్రా ఓట్లు.కాంగ్రెస్ మద్దతుతో వచ్చే ఓట్లతో బ్రాహ్మణి గెలుపు ఖాయం అవుతుందని.తెలంగాణలో ఈ గెలుపుతో పాటుగా మరి కొన్ని స్థానాల్లో తప్పకుండా టీడీపీ గెలిచే సీట్లు లెక్కించుకుంటే తప్పకుండా టీడీపీ అనుకున్న స్థాయిలో తెలంగాణలో చక్రం తిప్పగలదని అంచనా వేస్తున్నారు.

అయితే బ్రాహ్మణి తప్ప మరెవరికి కూకట్ పల్లి స్థానం కేటాయించినా సరే గెలుపు కష్టమనే టాక్ వినిపిస్తోందట.అందుకే చంద్రబాబు సైతం బ్రాహ్మణి అభ్యర్ధిత్వాన్ని పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube