అగ్రరాజ్యం అంటే అన్నిరంగాలలోనూ, ఆర్ధికంగా, అన్ని వ్యవస్థలలో పటిష్టంగా ఉన్న దేశంని అగ్రరాజ్యంగా అభివర్ణిస్తారు.అయితే అమెరికా ఇప్పుడు ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తోంది.
ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది తన మాట కాదన్న వారిని ఎన్ని ఇబ్బందులకి అయినా సరే గురిచేస్తుంది ఎంతన్నా అగ్రరాజ్యం కదా.అయితే ఈ అగ్రరాజ్యం స్థాయికి ఎదగడానికి అసలు కారణం మాత్రం వలసజీవుల కష్టమేనట.ఏంటి నమ్మలేకపోతున్నారా ఇది వాస్తవం.అమెరికా ఇంతగా అభివృద్ధి చెందటానికి అసలు కారణం కేవలం వలసజీవులేనని ఒక సర్వే లో బయటపడిటింది.ఇంతకీ ఆ అధ్యయనం ఏమిటి.? అనే వివరాలలోకి వెళ్తే.
అమెరికా మొత్తం సంపదలో మూడింట రెండో వంతు అమెరికాకు వలస వచ్చిన ప్రజలు సృష్టించినదేనట.2011 నుండి ఈ పరిస్థితి నెలకొందని సిటీ గ్రూప్ , ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయన నివేదిక తెలిపింది.ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్ ఈ నివేదికను ప్రచురించింది…అంతేకాదు వలసల్లో కోత విధిస్తే తప్పకుండా దేశ ప్రయోజనాలు ఆర్ధిక ప్రమాణాలు దెబ్బతింటాయని హెచ్చరించింది కూడా.అమెరికా జనాభాలో వలస వచ్చిన జనం కేవలం 14శాతమే వున్నా 40 శాతం చిన్న చిన్న వ్యాపారాలు వారివేనని వెల్లడించింది.
అమెరికాలో సగానికిపైగా స్టార్టప్ వ్యాపారాలేనని.వాటి విలువ వంద కోట్ల డాలర్లుపై మాటేనని పేర్కొంది.పేటెంట్లు తీసుకున్న ఆవిష్కరణలు సృష్టించిన వారిలో లేదా నోబెల్ బహుమతి పొందిన వారిలో వలసవాసులు రెండు రెట్లు కన్నా ఎక్కువగా వున్నారు, వీరు ట్రంప్ ప్రభుత్వానికి చెల్లించే పన్నులు కన్నా ఉపయోగించుకునే ప్రభుత్వ ప్రయోజనాలు చాలా తక్కువగా వున్నాయి.అయితే దీనికి ఉదాహరణంగా బ్రిటన్ ప్రభుత్వం 1990ల్లోతీసుకున్న ఈ రకమైన విధానాలని లేవనెత్తింది.
బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్‌ను నిలుపుచేసినట్లైతే ఇప్పుడు ఉన్న పరిస్థితి కన్నా 9శాతం తక్కువగా ఆర్థిక వృద్ధి వుండేదని పేర్కొంది…అయితే తాజా ఈ అధ్యయనంతో అయినా ట్రంప్ కళ్ళు తెరుస్తాడెమో వేచి చూడాలి.
.