కేరళను వర్షం కుదిపేసింది.గత వారం రోజులుగా వరద ముంచెత్తుతోంది.
అనేక ప్రాంతాలు నీటమునిగాయి.ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.
వందలాది మంది నిరాశ్రయులయ్యారు.ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
వేల సంఖ్యలో వరద బాధితులను కాపాడుతున్నాయి సహాయక టీమ్ లు.గర్భిణీలను క్షేమంగా తరలించి బిడ్డకు పురుడు పోశారు.ప్రాణాలకు తెగించి వరద బాధితులకు సాయం చేస్తూ రియల్ హీరోలనిపించుకుంటున్నారు.
కేరళలో ప్రకృతి విపత్తు, వరదల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజలు కుల మత బేధాలు లేకుండా స్పందిస్తున్నారు.
తమ స్థాయికి తగ్గట్టు విరాళాలు ఇస్తున్నారు.కొందరు ఐదు రూపాయలు ఇస్తున్నారు కొందరు లక్ష రూపాయలు .హీరోలు, సామాన్యులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగం లేని వాళ్లు.ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేస్తున్నారు.
మన హీరోలు కూడా సరైన సమయంలో స్పందించారు.చేయూతను అందించారు.‘కేరళ ప్రజలు నాపై చూపిన అమితమైన ప్రేమ, అభిమానం.నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచింది.
వారి కోసం నా వంతుగా సాయం చేయాలి అనుకుంటున్నా’’ అని 25 లక్షలు ఇస్తున్నట్లు హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.రామ్ చరణ్ తేజ్ 25 లక్షలు విరాళంగా అందించారు.
పది టన్నుల రైస్ ని కూడా పంపించారు.హీరో విజయ్ దేవరకొండ కూడా తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు.‘గీత గోవిందం’ సినిమా వసూళ్లను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందిస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు.హీరోలు మాత్రమే కాకుండా డైరక్టర్ కొరటాల శివ కూడా మూడు లక్షలు అందజేశారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ ఐదు లక్షల విరాళం అందించారు.
ఇది ఇలా ఉండగా.శృంగార తార సన్నీ లియోన్ విరాళం రూ.5 కోట్లు, తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ రూ.14 కోట్లు, పోర్చుగీసు ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్తియానో రొనాల్డో అయితే ఏకంగా రూ.77 కోట్లు.!! ఆయన ఇన్నేసి కోట్లు, ఈమె ఇన్నేసి కోట్లు.!! ఇదీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం.
సదరు ‘దాతలు’ తాము విరాళం ఇచ్చామని ఒక్క ప్రకటన చేయకున్నా అభిమానులు, ఆకతాయిలు వాళ్ల పేర్లతో దానాలు చేసిపారేస్తున్నారు.దీంతో లైకులే లైకులు.కోట్లు దండుకునే దీపికా, ఐశ్వర్యా రాయ్ వంటి సన్నీని చూసైనా కాస్త విరాళం ఇవ్వాలని పాఠాలు.!
సన్నీ లియోన్ నిజంగానే 5 కోట్లు ఇచ్చిందా అని కొన్ని మీడియా సంస్థలకు అనుమానమొచ్చి ఆమె సిబ్బందిని అడిగారు.
దానికి వారిచ్చిన సమాధానం విని నోరెళ్లబెట్టారు.‘ఆమె ఇలాంటి వ్యక్తిగత విషయాలను బయటికి చెప్పరు.
సాయం గురించి ఇతరులకు చెప్పరు.బాధితులు తరఫున ఆమె ప్రార్థన చేశారు.
ఆమె ఐదు కోట్లు ఇచ్చినట్లు మీకెవరు చెప్పారు?’ అని ఎదురు ప్రశ్నించారు.ఇక విజయ్ విషయం కూడా అంతే.
తాను 14 కోట్లు ఇచ్చినట్లు అతడు ఎక్కడా చెప్పలేదు.విజయ్ 5 లక్షలు ఇచ్చాడని వారం కిందట వార్తలొచ్చాయి.
వారం తిరిగేసరికి అది కాస్తా 14 కోట్లుగా మారింది.దళితుడైన విజయ్ అన్ని కోట్లు ఇచ్చాడని, ఇతర కులాల హీరోలు ఏం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.ఈ కోట్లకోట్ల విరాళాలను చూసి కొందరైతే తాము వంద కోట్లు ఇచ్చామని కొందరు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు.!! ఏదో సామెత చెప్పినట్టు.
పెట్టినమ్మ పుణ్యాన పోదు, పెట్టనమ్మ పాపాన పోదు.!! ఎవరి కోట్లు వాళ్లిష్టం.!! కానీ ఇది తమాషాలు, జోకులు వేయాల్సిన సందర్భం మాత్రం కాదని గుర్తించుకుంటే చాలు.!!
.