కాంగ్రెస్ తో చంద్రబాబు జట్టు..లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్...

అంతా మీరే చేశారు.ఆనాడు మీరు చేసిన ఘోరాన్ని తట్టుకోలేకనే ఎన్టీరామారావు గారు మంచం పట్టారు…ఆయన పార్టీని ఆయన చేతినుంచి దౌర్జన్యంగా లాకున్నారు.

 Lakshmi Parvathi Comments On Chandrababu-TeluguStop.com

నన్న అనరాని మాటలు అన్నారు.ఎన్టీఆర్ గారి ఎమ్మెల్యేలు అందరిని మీరు ఒక హోటల్ లో పెట్టి మరీ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని మీ చేతుల్లోకి తీసుకుని ఎన్టీఆర్ మరణానికి కారణం అయ్యారు.

ఈ మాటలు వింటుంటే గుర్తోచే ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి.ఆమె గురించి మాట్లాడాలంటే కూడా తెలుగుదేశం పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది.

ఆమెని కదపడం అంటే తేనే తుట్టెని కదిపినట్టే అనేది చంద్రబాబు ఫీలింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె తెరపైకి వచ్చారు వచ్చీ రావడంతోనే చంద్రబాబు పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మీ పార్వతి.ఎంతో వ్యుహత్మకంగానే ఎన్నికల ముందు తెరపైకి తీసుకువచ్చింది…ఎన్టీఆర్ ని చంద్రబాబు ఎంతక్షోభకి గురిచేసి ఆయన చావుకి కారణం అయ్యారో పదే పదే చెప్పే ఆమె ఇప్పుడు ఎన్నికల సంయమలో ఎంతో అవసరం కూడా.వైసీపి వ్యుహాలకి తగ్గట్టుగానే కాకుండా ఆమె ఒక ప్రత్యేకమైన శైలిలో బాబు పై విరుచుకు పడుతారు…తాజా గా ఆమె చంద్రబాబు పై మరో సారి నిప్పులు చెరిగారు.

చంద్రబాబు అక్రమాలు ప్రజలకి చెప్పడమే తన కర్తవ్యం అంటున్న ఆమె బాబు పై విమర్శలు గుప్పించారు

మీడియాతో మాట్లాడిన లక్ష్మి పార్వతి…బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు చెప్పిన చంద్రబాబు 2014 ఎన్నికల సమయానికి మాత్రం మోడీ కాళ్లు పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు…చంద్రబాబు అవకాశవాది అని చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలని అన్నారు…అసరమైతే కాళ్లు పట్టుకోవటం.అవసరం తీరాక విసిరి గోదార్లో పడేయటం బాబుకు బాగా తెలుసన్నారు.

అలా చంద్రబాబు వల్ల బలై పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిపారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఎంతమంది వచ్చినా నిలబడలేని పరిస్థితిలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ని ఎదిరించి మరీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఏపీలో కాంగ్రెస్ ని భూస్థాపితం చేసేశారు.

అయితే అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు చంద్రబాబు చేయీ చేయీ కలపడానికి సిద్దపడ్డారు అని అన్నారు ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆయన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు గోదాట్లో కలపడానికి సిద్దంగా ఉన్నారని ఆమె అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని జిత్తులమారి ప్లాన్స్ వేసినా సరే తప్పకుండా ఓటమి పాలవుతాడని ఆమె సఫధం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube