న‌మ్మిన‌వారే బాబును న‌ట్టేట ముంచుతున్నారా?

చంద్ర‌బాబు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న క‌డ‌ప జిల్లాలో బాబు వ్యూహం ఎదురు తిరిగింది.ఆయ‌న న‌మ్మిన నాయ‌కులే.

 Kadapa District Dp Group Politics-TeluguStop.com

ఇప్పుడు పార్టీని న‌ట్టేట ముంచుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.నిజానికి విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాలి.

ఇది చంద్ర‌బాబు వ్యూహం.వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో సైకిల్‌ను ప‌రుగులు పెట్టించాలి ఇది ఆయ‌న ఎత్తుగ‌డ‌.

ఈ క్ర‌మంలోనే ఈ జిల్లాకు చెందిన కీల‌క నేత‌గా భావిస్తున్న జ‌గ‌న్‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్న సీఎం ర‌మేష్‌కు చంద్ర‌బాబు మ‌రోసారి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా రెన్యువ‌ల్ ఇచ్చారు.అయితే.

బాబు వ్యూహం ఎంత వ‌రకు స‌క్సెస్ అవుతోంది? బాబు ఎంత మేర‌కు క‌డ‌ప జిల్లాపై ప‌ట్టుసాధిస్తున్నారు.ఎంత మేర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌డ‌ప‌లో హ‌వా ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌రు? అనే ప్ర‌శ్న‌లు ఇప్ప‌టికీ స‌శేషంగానే మారిపోయాయి.

నిజానికి చంద్ర‌బాబు జ‌గ‌న్‌ను అణ‌గ‌దొక్కే వ్యూహంలో భాగంగానే ఇక్కడి జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డిని త‌న పార్టీలోకి చేర్చుకున్నారు.ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు.అదేవి ధంగా బ‌ద్వేల్‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే జ‌య‌రాములును కూడా పార్టీలోకి చేర్చుకున్నారు.ఇక‌, మైద‌కూరుకు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కు కూడా బాబు వ‌ల విసిరారు.

ఈ క్ర‌మంలో ఈ నియోక‌వ‌ర్గానికి చెంది న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌నున్న‌ట్టు స‌మాచారం.ఇలా ఒక్క‌టొక్క‌టిగా జ‌గ‌న్ చుట్టూ ఉచ్చు బిగించేస్తున్నాన‌ని చంద్ర‌బాబు సంబ‌ర‌ప‌డుతున్నారు.

అయితే, ఆయ‌న‌కు ఈ ప‌రిణామాలే ఇబ్బందిగా మారాయి.ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప‌లో టీడీపీ ప‌రిస్థితిని అంచ‌నావేస్తే.

ఇక్క‌డ టీడీపీ బ‌ల‌ప‌డిన మాట అటుంచి.వ‌ల‌స నేత‌ల‌తో పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టింది.

ఆదినారాయ‌ణ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీ నేత‌ల‌తో క‌య్యానికి దిగుతున్నారు.ఇది చాల‌ద‌న్న‌ట్టు బ‌ద్వేలుపై త‌న హ‌వా ప్ర‌ద‌ర్శిస్తూ.టీడీపీలో అంత‌ర్గ‌త ర‌చ్చ‌కు కార‌ణ‌మై.వార్నింగులు ఇప్పించుకుంటున్నారు.

ఇక‌, మైదుకూ రు విష‌యంలోనూ అక్క‌డి సీనియ‌ర్ నేత పుట్టా సుధాక‌ర్‌ను టీటీడీ బోర్డు చైర్మ‌న్ చేసినా.ఆయ‌న మ‌ళ్లీ ఎమ్మెల్యే సీటుకు రెడీ అంటున్నాడు.

ఇలా క‌డ‌ప‌లో జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బాబుకు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌తిబంధ‌కాలు ఎదుర‌వుతున్నాయి.తాజాగా.

జ‌రిగిన మ‌రో ప‌రిణామం.టీడీపీకి శ‌రాఘాతంగా ప‌రిణ‌మించింది.

క‌ప‌డ‌ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్‌నాయుడు త‌న‌ పదవికి రాజీనామా చేశారు.అంతేకాదు, ఆయ‌న వైసీపీలో చేరిపోయాడు.

జిల్లాలో టీడీపీని ముందుండి న‌డిపించిన బొల్లినేనికి మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే, ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు క‌నీసం త‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌క‌పోవ‌డం, త‌న సీనియార్టీని, సిన్సియార్టీని బాబు గుర్తించ‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌నస్థాపానికి గురైన బొల్లినేని.

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.వైసీపీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి నేతృత్వంలో బొమ్మినేని రామ్మోహన్‌నాయుడు అనుచరులు భారీ ఎత్తున వారి స్వగ్రామంలో వైసీపీలో చేరారు.

వీరికి ఎంపీ మిథున్‌రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ ప‌రిణామం టీడీపీకి పెను దెబ్బేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.నిజానికి.

పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన బాబుకు ఇలా ఎదురుగాలి వీస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube