తెలంగాణలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila )పరిస్థితి.రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో ప్రత్యేక పార్టీ పెట్టి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగిన షర్మిల.
పరిస్థితి మున్నాళ్ల ముచ్చటగానే మారింది.ప్రజల్లో పాదయాత్రలు, పర్యటనలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిల్లో మద్దతు లభించలేదు.
దాంతో పరిస్థితి ఎలాగే కొనసాగితే తన రాజకీయ భవిష్యత్ కు ముగింపు పడినట్లే అని భావించిందో ఏమో గాని, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు అడుగులు వేసింది.కాంగ్రెస్ లో చేరి క్రియాశీలకంగా మారాలని కలలు కానింది.

కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు కూడా షర్మిల రాకను గట్టిగానే స్వాగతించారు.కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మాత్రం షర్మిల అవసరత టి కాంగ్రెస్ కు లేదని ఖరాఖండీగా చెబుతూ వచ్చారు.దీంతో టి కాంగ్రెస్ తలుపులు తెరుచుకున్నట్లే కనిపించ్చిన మళ్ళీ మూసుకున్నాయి.దాంతో షర్మిల డీకే శివకుమార్ ద్వారా అధిష్టానంతో విలీనంపై పలుమార్లు చర్చించారు.అధిష్టానం కూడా అటు సానుకూలంగాను గాని లేదా ప్రతికూలంగాను గాని స్పందించలేదట.తటస్థంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఆమె ఆశిస్తున్న పాలేరు టికెట్.తుమ్మలకు కన్ఫర్మ్ చేసే పనిలో ఉంది.

అలాగే ఆమెను పార్టీలో చేర్చుకుంటే రేవంత్ రెడ్డి స్లో అయ్యే అవకాశం ఉంది.దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అంశాన్ని అధిష్టానం హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.అయితే మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి విలీనంపై తుది నిర్ణయం తీసుకోకపోతే అటు తనకు తన పార్టీకి భారీ నష్టం చేకూరుతుందని షర్మిల ( YS Sharmila )ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ విలీనానికి కాంగ్రెస్ ససేమిరా అంటే తన పార్టీ ద్వారానే బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారట.
అందుకే చివరి ప్రయత్నంగా షర్మిల మరిసారి డిల్లీ వెళ్ళినట్లు తెలుస్తోంది.డీకే శివకుమార్( DK Shivakumar ) ద్వారా చివరి సారి కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపి.
తదుపరి ఎలా అడుగులు వేయాలో డిసైడ్ అవుతారట.మరి షర్మిల తన పార్టీ నుంచే బరిలోకి దిగుతారా లేదా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతారా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.








