తెలుగువాడి ఆత్మ గౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు నందమూరి తారక రామారావు.కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఏపీని కూకటి వేళ్ళతో సహా పీకి పడేసేలా ఢిల్లీ ఫీటం దద్దరిల్లేలా ఎన్టీఆర్ ఒక ప్రభంజనాన్ని సృష్టించారు.
రాబోయే తరాలు ఎవడో దయాదాక్షిణ్యాల మీద బ్రతక కూడదు అంటూ తెలుగు ప్రజలకి తెలుగు వాడే నాయకుడు కావాలి ఢిల్లీ దిగిరావాలి అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజలలో పౌరుషాన్ని కలిగించాయి దాంతో తెలుగు ప్రజలు అందరు ఒక్కసారిగా ఎన్టీఆర్ కి జై కొట్టి ముఖ్యమంత్రిని చేశారు.ఏపీ రూపురేఖలు మారి పోయాయి.
అప్పటి నుంచీ తెలుగు ప్రజలకి ఎన్టీఆర్ ఒక సినిమా నటుడిగా కంటే కూడా ప్రజల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా ఆరాధ్యుడు అయ్యారు.అయితే
ఆ తరువాత చంద్రబాబు పాలన ఎన్టీఆర్ ని మరిపించలేక పోయినా సరే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన అందించారు అయితే మడమ తిప్పని మాట తప్పని పార్టీ గా అన్న గారు ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని తీర్చి దిద్దారు కానీ చంద్రబాబు మాత్రం ఆదిసగా సక్సెస్ అవ్వలేక పోయారు.ఏపీ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఎన్టీఆర్ స్థాపించన తెలుగుదేశం పార్టీయేనా ఇది అనే సందేహం కలుగక మానదు.ఒక పక్క ఎన్టీఆర్ మడమ తిప్పని నేతగా మాట ఇస్తే మరచిపోని నేతగా ఆరాధ్యుడిగా కీర్తించబడుతుంటే.
చంద్రబాబు మాత్రం మాటలు తప్పుడు మడమ తిప్పుడు “యూటర్న్” బాబు గా నిలిచి పోయారు.
అధికారంలోకి రాకముందు స్పెషల్ స్టేటస్ పై వెనక్కి తగ్గేది లేదని ఏపీ కి ప్రత్యేక హోదా కావాలని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ విషయంలో మనకి ఏమి ఒరుగుతుంది అని కామెంట్స్ చేశారు.
అసలు దానివల్ల ఉపయోగం లేదు అనేశారు .ఎంతో మంది మేధావులు సినిమా వాళ్ళు స్పెషల్ స్టేటస్ విషయంలో నిరసనలు తెలిపితే జైల్లో పెట్టించిన చంద్రబాబు.ప్రతిపక్షాలు స్పెషల్ స్టేటస్ విషయంలో ఉద్యమాలు చేస్తూ కేంద్రం పై ఒత్తిడి తెస్తుంటే మళ్ళీ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు అవును ఎపీకి స్పెషల్ స్టేటస్ అవసరమే అంటూ తమ పార్టీ నేతలతో ఉద్యమాలు చేయిస్తున్నారు.ఆ ఘటనతో చంద్రబుబు ముందు నారా తీసేసిన ప్రజలు యూటర్న్ బాబు అని పెట్టుకున్నారు…
ఇదిలాఉంటే.
పవన్ కళ్యాణ్ గుంటూరు వేదికగా చంద్రబాబు ని లోకేష్ ని అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ఖండించిన లోకేష్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతీ సారి మెతక వైఖరినే ప్రదర్శించారు.లోకేష్ పై పదే పదే పవన్ కళ్యాణ్ విరుచుకు పడుతున్నా సరే లోకేష్ మాత్రం పవన్ అంటే నాకు చాలా అభిమానం ఆయన్ని నేను గౌరవిస్తాను అంటూ ఎదో చేద్దామని అనుకుంటూ ఎదో చేస్తున్నారు.
అయితే తాజాగా పవన్ చేసిన కామెంట్స్ కి బదులుగా కౌంటర్ ఇవ్వాల్సిన లోకేష్ పవన్ పై విరుచుకు పడకుండా “యూ టర్న్” తీసుకుని పవన్ కి బిస్కెట్స్ వేస్తున్నారు.
అయితే ఈ విషయాలని గమనిస్తూ వస్తున్నా తెలుగు తమ్ముళ్ళలో అసహనం పెరిగిపోతోంది.
ఇదెక్కడి యూటుర్న్స్ రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.అన్న ఎన్టీఆర్ స్పూర్తి ఎక్కడికి పోయింది తెలుగుదేశం పార్టీ పై చిన్న ఈగ వాలినా సరే తరిమి తరిమి కొట్టిన చరిత్రలు ఉన్న పార్టీలో ఇలాంటి సాఫ్ట్ కార్నర్ వలన నిజంగానే లోకేష్ అవినీతి చేశాడా అనే సందేహాలు సొంత పార్టీలోనే కలుగుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.
ఇక నైనా సరే అసలు సిసలు తెలుగుదేశం నేతలుగా ఉండాలని కోరుకుంటున్నారు.
.