వాళ్లిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు... ఖ‌మ్మంలో గులాబీకి ఇక తిరుగే లేదు..

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మధ్య రాజకీయ వైరానికి తెరపడినట్లు ప్రచారం జరుగుతోంది.అధికార పార్టీలో గల మంత్రి, ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విబేధాల ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సరికొత్త స్నేహాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

 Tummala Nageswara Rao With Jalagam Venkat Rao-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెడుతున్న నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థులు చేతులు కలిపినట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, జలగం కుటుంబాలకు మధ్య దశాబ్ధ కాలంగా రాజకీయ వైరం ఉంది.

ఈ రెండు కుటుంబాలు సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ వేదికగా అనేక ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి.గెలుపు, ఓటములు ఎలా ఉన్నా జలగం వెంగళరావు హయాంలో మొదలైన ఈ రాజకీయ వైరం నేటికీ కొనసాగుతోంది.

సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 1985, 94, 99 ఎన్నికల్లో మూడుసార్లు తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.తుమ్మల గెలిచిన ఆయా సంవత్సరాల్లో మినహా మిగతా అనేక ఎన్నికల్లో జలగం కుటుంబం నుంచి వెంగళరావు, వెంకటరావు, ప్రసాదరావు విజయం సాధించారు.ఈ పోటీలో స‌త్తుప‌ల్లిలో జ‌ల‌గం కుమారులు ప్ర‌సాద‌రావు, వెంక‌ట‌రావు చేతుల్లో ఓడిన తుమ్మ‌ల మ‌ళ్లీ వీరిద్ద‌రిని ఓడించాడు.కాగా నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది.దీంతో తుమ్మల తన మకాం ఖమ్మం జిల్లా కేంద్రానికి మార్చారు.2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు.

2016 లో జరిగిన ఉపఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా తుమ్మల విజయం సాధించారు.అయితే 2009 ఎన్నికల్లో తుమ్మలపై వెంకటరావు ఖమ్మం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అనంతరం వెంకటరావు టీఆర్ ఎస్ లో చేరి గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

జిల్లాలో అధికార పార్టీ నుంచి విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా వెంకటరావు గుర్తింపు పొందారు.ఖమ్మం నుంచి పరాజయం పాలైన తుమ్మల అనూహ్యంగా కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ సంపాదించుకున్నారు.

జిల్లాలో తుమ్మ‌ల టీఆర్ఎస్‌లో చేరే వ‌ర‌కు ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వెంక‌ట‌రావుకు తుమ్మ‌ల చేరిక‌తో గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్ల‌య్యింది.ఈ నేపథ్యంలో తుమ్మల, జలగం వెంకటరావు జిల్లా రాజకీయాల్లో పైచేయి సాధించడానికి పరస్పరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరూ ఏకమవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ల మధ్య మిత్రుత్వం కారణంగానే తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు కలిసిపోయారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈ ఇద్ద‌రు బ‌ద్ధ శ‌త్రువుల మ‌ధ్య ఉన్న వ‌ర్గ‌పోరు స‌మ‌సిపోయి వీరు స్ట్రాంగ్ అవ్వ‌డంతో ఇప్పుడు వీరిద్ద‌రికి తిరుగులేకుండా పోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube