ఈ రోజుల్లో జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఎన్నో ఆహారాలను తీసుకోవటం మానేస్తున్నాం.వాటిలో సోంపు ఒకటి.
ఒకప్పుడు భోజనం అయ్యాక సోంపు తినేవారు.ఇప్పుడు హోటల్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే సోంపు తింటున్నాం.
అది కూడా షుగర్ కోట్ ఉన్న సోంపును తింటున్నాం.అదే షుగర్ కోటెడ్ సోంపు కాకుండా నేచురల్ సోంపును ప్రతి రోజు భోజనం అయ్యాక తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మానకుండా తినటం అలవాటు చేసుకుంటారు.
వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.
సోంపులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.అంతేకాక రక్తనాళాలు వెడల్పుగా ఉండేలా చేస్తుంది.
కొలస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి కూడా సహాయపడుతుంది.
ఐరన్, కాపర్ సమృద్ధిగా ఉండుట వలన రక్తం బాగా పడుతుంది.
రక్తహీనతతో బాధపడేవారికి సోంపు మంచి ఔషధం అని చెప్పవచ్చు.గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది.
సోంపులో మాంగనీస్, జింక్, కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిషయం వంటి ఖనిజ లవణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ప్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది.
భోజనం చేసిన వెంటనే స్ప్మ్పు తినటం వలన నోటిలో బ్యాక్టీరియా నశించి నోరు తాజాగా ఉంటుంది.
అలాగే దంతాలు,చిగుళ్లు బలంగా మారతాయి.
సోంపు తినటం వలన జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్, అసిడిటీ, అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు రావు.