ఏపీ ఎంపీలకి మోడీ అవమానం..

బడ్జెట్లో లో ఏపీ కి తీవ్రమైన అన్యాయం చేయడమే కాకుండా.మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్న టిడిపి ఎంపీలని ఘోరంగా అవమానించారు ప్రధానమంత్రి మోడీ.

 Ap Mps Ki Modi Avamanam-TeluguStop.com

ఏపీ విషయంలో కేంద్రం ఎందుకు చిన్న చూపు చూస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఈ విషయంలో ప్రధాని కానీ కేంద్ర మంత్రులు కానీ ఏపీ ఎంపీలని పట్టించుకోలేదు అని తెలుస్తోంది…విభజనలో హామీలని మాత్రమే తాము అమలు చేయమన్నాం కొత్తగా మేము ఏమీ కోరడం లేదు అని తెలుపుతున్నా సరే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు మోడీ అని అంటున్నారు.

అసలేం జరిగిందంటే.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపికి అన్యాయం జరిగిన విషయాన్ని వివరించేందుకు కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధానిని కలిసారు…అయితే సుజనాతో పాటు మిగిలిన టిడిపి ఎంపీలు అందరు కూడా ప్రధాని ని కలవడానికి ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు…అయితే కేవలం సుజనాని మాత్రమే పంపి మిగిలిన వారిని బయటే ఉంచేశారు.ప్రధానిని కవలవడానికి అందరం అపాయిట్మెంట్ తీసుకున్నమని చెప్పినా సరే ప్రధాని కార్యాలయం వినలేదు.

చివరకి సుజనా మాత్రం లోపలికి వెళ్లారు.మోడీ తో సుమారు 20 నిమిషాలు మాట్లాడిన మోడీ.

ఆ సమయంలో సుజనా మాటల్ని పెద్దగా పట్టించుకోలేదట…మోడీ ని కలిసి బయటకి రాగానే ఇదే విషయం చంద్రబాబుకి చెప్పారట సుజనా.

ఇదిలాఉంటే సోమవారం నాడు టిడిపి ఎంపిలకి హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అపాయిట్మెంట్ ఇచ్చారు…అయితే అందరూ ఏపీ ప్రజల ఆశలని వ్యక్తపరుచగా వినీ విననట్టుగా ఏదో ముక్తసరిగా పది నిముషాలు మాట్లాడి పంపేసారట…అంతేకాదు ఇంకేమన్నా సమస్యలు ఉంటే ప్రధానితో మాట్లాడండి అని సలహా ఇచ్చారట…అరుణ్ జైట్లీ లాంటి వారు కలవమని చెప్పి తరువాత బిజీ అని అపాయిట్మెంట్ రద్దు చేశారట.

మిత్రపక్షంగా ఉన్న టిడిపిని కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతోందో ఇది ఒక నిదర్సనమని అంటున్నారు టిడిపి నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube