గత ఏడాది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం తెలిసిందే.ఈ క్రమంలో ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం( Free Bus ) హామీ ఇచ్చి.
దానిని అమలు చేస్తూ ఉంది.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) సైతం అధికారంలోకి వస్తే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది.
కాగా తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారంపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టత ఇచ్చారు.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.
మరో నాలుగు నెలలలో సరికొత్త హంగులతో 1500 సూపర్ లగ్జరీ బస్సులు రాబోతున్నట్లు పేర్కొన్నారు.ఇదే సమయంలో సంక్రాంతి పండుగ( Sankranthi Festival )కు రెండువైపులా బస్సు బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే త్వరలో డోర్ డెలివరీ, డోర్ పికప్ లాజిస్టిక్ ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు.డోర్ పికప్ పైలెట్ ప్రాజెక్టు విజయవాడలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.