కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టాలంటే.... సులభమైన చిట్కా

మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కంటి కింద నల్లని వలయాలు ఏర్పడుతున్నాయి.సాధారణంగా ఈ నల్లటి వలయాలు కనపడగానే మార్కెట్ కి వెళ్లి ఏదో క్రీమ్ తెచ్చేసి రాసేస్తూ ఉంటాం.కానీ ఆ విధంగా చేయటం చాలా  తప్పు.మనకు ఇంటిలో అందుబాటులో ఉండే కొన్ని వస్తువుల ద్వారా ఈ నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.

 Home Remedies To Remove Dark Circles Naturally Details, Dark Circles, Home Reme-TeluguStop.com

పుదీనా ఆకులను పేస్ట్ గా చేసి కంటి చుట్టూ ప్యాక్ వేయాలి.ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కంటి కింద నల్లటి వలయాలను తగ్గించటంలో టోమోటా చాలా  సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఒక టమోటా పేస్టులో ఒక స్పూన్ నిమ్మ రసం,చిటికెడు పసుపు,చిటికెడు శనగపిండి కలపాలి.

ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి అరగంట తర్వాత శుభ్రం చేయాలి.ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి కంటి మీద పెట్టుకొని పది నిమిషాల తర్వాత తీసేసి చల్లని నీటితో కడిగితే కంటి చుట్టూ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు కంటి చుట్టూ బాదం ఆయిల్ లేదా బాదాం క్రీమ్ రాసి సున్నితంగా మసాజ్ చేసే మంచి ఫలితం ఉంటుంది.

గ్లిజరిన్,ఆరెంజ్ జ్యుస్ సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాయాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నిదానంగా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

ఈ ఇంటి నివారణ చాలా బాగా పనిచేస్తుంది.

నిమ్మరసం,టోమోటా రసం సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.బంగాళాదుంప రసాన్ని తీసి కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube