బాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుల్లో షారుఖ్ ఖాన్ ఒకరనే సంగతి తెలిసిందే.ఒకవైపు వరుస సినిమాలతో షారుఖ్ ఖాన్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తారు.
షారుఖ్ ఖాన్ కూతురు సుహానాలో హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉండగా రాబోయే రోజుల్లో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.అయితే పలు మ్యాగజైన్ కవర్లపై మాత్రం సుహానా దర్శనమిస్తున్నారు.

ఈ నెల 22వ తేదీన సుహానా పుట్టినరోజును జరుపుకోగా షారుఖ్ ఖాన్ తన కూతురు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి యాక్టివ్ గా ఉంటారనే నమ్మకం తనకు లేదని షారుఖ్ పేర్కొన్నారు.అదే సమయంలో షారుఖ్ ఖాన్ తన కూతురును పెళ్లి చేసుకోవాలనే వ్యక్తికి కొన్ని షరతులను విధించారు.ఆ షరతులను అంగీకరించే వ్యక్తికి మాత్రమే కూతురును ఇస్తానని షారుఖ్ ఖాన్ వెల్లడించారు.
తన కుతురుతో డేటింగ్ చేసే వ్యక్తికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలని షారుక్ ఖాన్ పేర్కొన్నారు.తన కూతురును లవ్ చేసే అబ్బాయిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడనని షారుఖ్ తెలిపారు.
తన కూతురును తాను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడని తన కూతురును చేసుకోబోయే వ్యక్తి విషయంలో కూడా అదే జరగొచ్చని షారుఖ్ వెల్లడించారు.సుహానాకు ప్రియుడు కాబోయే వ్యక్తి న్యాయవాది అయి ఉండాలని షారుఖ్ చెప్పారు.
తాను తన కూతురును యువరాణిలా పెంచానని ఏ కుర్రాడు తనను ఆ విషయంలో జయించలేడని షారుఖ్ అన్నారు.తన కూతురుకు ఏమైనా జరిగితే తాను జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడనని షారుఖ్ తెలిపారు.
తన కూతురును బాధ పడితే ఆమె ప్రియుడిని తాను కూడా బాధ పెడతానని షారుఖ్ అన్నారు.ఈ షరతులకు అంగీరించిన వ్యక్తి తన కూతురుకు ప్రియుడు కావడానికి తనకు అభ్యంతరం లేదని షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చారు.