ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. క్రీడల మంత్రికి కోలుకోలేని షాక్

క్రికెట్‌లో కొన్ని అరుదైన రికార్డులు ఉంటాయి.అవి ఏ స్థాయి క్రికెట్ పోటీల్లో నమోదైనా చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతుంటారు.

 6 Sixes In One Over.. An Irreparable Shock To The Sports Minister , Sports News,-TeluguStop.com

ముఖ్యంగా ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు బాల్స్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టడం కూడా ఒకటి.పాకిస్తాన్ బ్యాట్స్ మాన్ ఇఫ్తిఖార్ అహ్మద్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఇఫ్తికార్ ఈ ఘనత సాధించాడు.తన జాతీయ జట్టు భాగస్వామి, ఫాస్ట్ బౌలర్ వాహాబ్ రియాజ్ ఓవర్లో ఈ 6 సిక్సర్లు కొట్టడం ద్వారా క్రికెట్ ప్రపంచం తన వైపు చూసేలా చేశాడు.

అయితే వాహబ్ రియాజ్ ప్రస్తుతం పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర క్రీడల మంత్రిగా ఉన్నాడు.దీంతో క్రీడల మంత్రికి కోలుకోలేని షాక్‌ను ఇఫ్తికార్ ఇచ్చాడు.

పీఎస్‌ఎల్ లో భాగంగా పెషావర్ జాల్మి, క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య ఇటీవల ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో, క్వెట్టా గ్లాడియేటర్స్ మొదట బ్యాటింగ్ చేసింది.ఇఫ్తికార్ రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆ జట్టు 184 పరుగులు చేసింది.పెషావర్ జాల్మి కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇఫ్తికార్ బ్యాటింగ్ చేస్తుండగా వాహబ్ రియాజ్ బౌలింగ్ కు వచ్చాడు.అతడి బౌలింగ్ లో ఇఫ్తికార్ చెలరేగిపోయాడు.ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు.ఈ రికార్డు సాధించిన వారి జాబితాలో పాకిస్తాన్ జట్టు నుంచి రెండవ బ్యాట్స్ మాన్, ప్రపంచంలోని 14 వ బ్యాట్స్ మాన్ అయ్యాడు.

ఇఫ్తికార్ 50 బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేశాడు.ఇక బౌలర్ అయిన వహాబ్ రియాజ్ ఇటీవల పంజాబ్ ప్రావిన్స్ క్రీడా మంత్రిగా నియమితులయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube