శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం బుట్ట బొమ్మ.తాజాగా విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ కావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.బుట్ట బొమ్మ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పేలా సినిమాకు రీమేక్ గా తెరరికెక్కిన విషయం తెలిసిందే.
మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ సినిమాలో మలయాళ సినిమా స్క్రీన్ ప్లే ను మారుద్దామని ప్రయత్నించినప్పటికీ ఒరిజినల్ స్క్రీన్ ప్లేను 90 శాతం ఫాలో అవ్వడంతో పాటు డైలాగులు కూడా మలియాల వెర్షన్ లోనే ఉన్నాయి.
అయితే మామూలుగా బుట్ట బొమ్మ సినిమా సెట్ అయ్యేది కాదు.కానీ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ దానికి ఆవు పట్టు అని చెప్పవచ్చు.
హీరో క్యారెక్టర్ జనాలకు కనెక్ట్ కావడం కష్టం.మలయాళ వెర్షన్ లో హీరోయిన్ పూర్తిగా ఇన్నోసెంట్.
కానీ తెలుగులో మాత్రం అలా కాదు.తండ్రి మీద అసంతృప్తితో వుంటుంది.
తనకు ఓ బాయ్ ఫ్రెండ్ వుండాలని కోరుకుంటుంది.అయితే తెలుగులో మాత్రం హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కావాలని కృష్ణుడిని కోరుకోగానే హీరోలా కనిపించే విలన్ ను ఫోన్ లో పరిచయం చేయడం.
అంటే దేవుడు విలన్ ను ప్రెండ్ గా ప్రసాదించాడనుకోవాలా? నిజానికి బుట్టబొమ్మకు కృష్ణుడు రక్షణగా వుంటాడు.తనతోనే వుంటాడు అన్నది ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేశారు.
అదే విధంగా కృష్ణుడే కాపాడాడు మరో హీరో రూపంలో అన్నది ఏదో విధంగా చెప్పి వుంటే బాగుండేది.

కానీ అలా చెప్పకుండా ఇలా చూపించడం వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యి ఈ సినిమా డిజస్టర్ గా నిలిచింది.అలాగే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే వల్ల తిరిగిన చోటే తిరిగినట్టు అనిపించింది.ఇందులో ద్వితీయార్థంలో కాస్త థ్రిల్లింగ్ సీన్లు వుండడం మరో కారణం.
సినిమాలో తొలిసగానికి సరైన ఎంగేజ్డ్ స్క్రీన్ ప్లే అందించలేకపోయారు.మొత్తంగా హీరోయిన్ క్యారెక్టర్ డిజైనింగ్ ని తెలుగు స్క్రీన్ ప్లే లో దెబ్బతీసిందని చెప్పవచ్చు.
హీరోయిన్ ఫ్రెండ్ బెటర్.బాయ్ ఫ్రెండ్ చేయి వేస్తే చెంప చెళ్లు మనిపించింది.
కానీ హీరోయిన్ లాడ్జిలో హీరో దగ్గరకు లాక్కోగానే పెద్దగా అభ్యంతరం పెట్టదు.డైలాగుల్లో కూడా ఎంత సేపూ హీరోను మంచి వాడికి ఓవర్ ప్రోజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు తప్ప, కొత్తగా ప్రయత్నించలేదు.

ఇందులో కొత్తగా అందమే క్లాలిఫికేషన్ అని ఫిక్స్ చేసారు.మరి హీరోయిన్ స్నేహితురాలు అందంగా లేని కమెడియన్ ను ఎలా ప్రేమించినట్లో? అనేది అర్థం కావడం లేదు.అలా బుట్టబొమ్మను ఇలా మార్చాలని కానీ, మార్చ కూడదని కానీ ఓ ఐడియా పెట్టుకుని ముందుకు వెళ్లినట్లు లేదు.పైగా రివర్స్ మెథడ్ అన్నట్లుగా ముందు నుంచి వెనుక్కు మళ్లీ ఫ్లాష్ కట్ లు వేసి చూపించిందే చూపించి బోర్ కొట్టించేసారు.
ఇన్ని కారణాలు ఉండడం వల్ల తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.







