తాజాగా ఇండియన్ మార్కెట్లో ప్రీమియం బైక్ బీఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ (BMW S 1000 RR) విడుదలైంది.కంపెనీ ఈ బైక్ ధరను ఏకంగా రూ.20.25 లక్షలు నుంచి రూ.24.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గానిర్ణయించింది.ఈ బీఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ స్టాండర్డ్, ప్రో, ప్రో ఎమ్ స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది.బీఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ మోటార్‌సైకిల్‌ను ఆల్రెడీ రిలీజ్ చేసింది అయితే 2023 వెర్షన్‌గా కొత్త బైక్‌ని తీసుకొచ్చింది.
ఇప్పుడు రిలీజ్ అయిన ఈ బైక్‌ను కాస్మెటిక్‌గా, మెకానికల్‌గా అప్‌డేట్ చేసింది.
ఈ కొత్త బైక్‌లోని ఇంజన్ ఇప్పుడు గరిష్ఠంగా 206 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది.206 బీహెచ్‌పీ పవర్ ఉందంటే ఈ బైక్ రైజింగ్ ఇచ్చిన వెంటనే ఎంత ఫాస్ట్ వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు.కంపెనీ ప్రకారం దీని గరిష్ట వేగం గంటకు 306-314 కిలోమీటర్లు.
ఓల్డ్ వెర్షన్ బైక్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వెర్షన్ బైక్ పవర్ 2 బీహెచ్‌పీ పెరిగింది.అయితే టార్క్ అవుట్‌పుట్ మాత్రం అలాగే ఉంది.కాగా రెవ్ లిమిటర్ 14,600 ఆర్‌పీఎమ్‌కి పెంచబడింది.ఈ మోటార్ సైకిల్‌లో బీఎమ్‌డబ్ల్యూ ShiftCam టెక్నాలజీ, వెనుక టైర్ వద్ద మరింత ట్రాక్షన్ కోసం లో సెకండరీ గేర్ రేషియో కూడా ఉంది.ఇందులో అందించిన 999 సీసీ, ఇన్-లైన్ 4-సిలిండర్ ఇప్పుడు 13,750 ఆర్‌పీఎమ్ వద్ద 206 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.11,000 ఆర్‌పీఎమ్ వద్ద 113 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

అలానే ఈ మోటార్‌సైకిల్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్, M బ్యాటరీ, 6.5-అంగుళాల TFT స్క్రీన్, కొత్త rev కౌంటర్ డిస్‌ప్లేను ఆఫర్ చేశారు.లెఫ్ట్ హ్యాండిల్‌బార్‌పై ఉన్న మల్టీ-కంట్రోలర్‌ని ఉపయోగించి TFT స్క్రీన్‌ని కంట్రోల్ చేయవచ్చు.ఈ బీఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్ ABS ప్రోతో వస్తుంది.ఇందులో బ్రేక్ స్లయిడ్ అసిస్ట్, ABS ప్రో స్లిక్ సెట్టింగ్ ఫీచర్ అందించారు.