టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరో అడివి శేష్ రైటర్ గా తన సినిమాలకు తనే కథ రాసుకునే అడివి శేష్ అమీ తుమీ తర్వాత హిట్ 2 నే బయట కథతో సినిమా చేశాడు.ఈ సినిమా తో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన అడివి శేష్ తన నెక్స్ట్ సినిమా గూఢచారి 2 తో రాబోతున్నాడు.
అయితే అడివి శేష్ ఆరు వరుస హిట్లు ఇచ్చినా సరే అతనితో భారీ బడ్జెట్ పెట్టి సినిమా చేయాలని ఎవరు ముందుకు రావట్లేదు.ఇన్ని హిట్లు ఇచ్చినా సరే అతను ఇంకా మీడియం బడ్జెట్ హీరోగానే ఉన్నాడు.
లో బడ్జెట్ తో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తున్న అడివి శేష్ ఇప్పుడిప్పుడే స్టార్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.గూఢచారి 2 మాత్రం తన రేంజ్ పెంచుతుందని సినిమా బడ్జెట్ కూడా భారెగా ఉంటుందని అంటున్నాడు అడివి శేష్.
ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.తెలుగులో గూఢచారి లాంటి స్పై థ్రిల్లర్ ఈమధ్య రాలేదని అనుకున్నారు.మరి ఇప్పుడు గూఢచారి 2 అంతకుమించి ఉంటుందని అంటున్నాడు అడివి శేష్.తప్పకుండా అతను చెప్పే బాటలని బట్టి చూస్తుంటే సినిమా వేరే రేంజ్ లో ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు.