కన్నడ భామ శ్రీలీల తెలుగులో పెళ్లిసదండి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాతో ఆమెకు మంచి మైలేజ్ ఏర్పడింది.
దానితో ఒక్కసారిగా తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటుంది.తెలుగు లో ఆమెకు వచ్చిన క్రేజ్ చూసి ఆమె కన్నడలో నటించిన సినిమాలని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
కన్నడలో శ్రీ లీల తొలి సినిమా కిస్.ఈ సినిమా తోనే ఆమె చాలా పాపులర్ అయ్యింది.
శ్రీలీల కిస్ సినిమాని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఆల్రెడీ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా తెలుగులో రిలీజ్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.అయితే శ్రీ లీలని నమ్ముకుని తెలుగులో ఆమె మొదటి సినిమా ఇంత వైడ్ గా రిలీజ్ చేయడం మాత్రం రిస్క్ అని అంటున్నారు.
కిస్ సినిమాలో విరాట్ హీరోగా నటించగా అర్జున్ డైరెక్ట్ చేశారు.శ్రీ లీల నటించిన ధమాకా కూడా డిసెంబర్ 23న రిలీజ్ ఫిక్స్ చేశారు.ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి శ్రీలీలకు నిజంగానే డబుల్ ధమాకా అని చెప్పొచ్చు.







