“14 మంది భారతీయుల” కి యూఏఈ లో “ఉరిశిక్ష”..?

డబ్బు సంపాదన కోసం దేశం కాని దేశం వెళ్ళిన భారతీయులు.ఒకే తాటిపై నిలబడి ఒకరికి ఒకరు సాయం చేసుకోవాల్సింది పోయి గ్రూపులుగా ఏర్పడి ఇద్దరు తోటి భారత ఎన్నారైలని హత్య చేశారు.

 14 Indians Killed 2 Indian Nris-TeluguStop.com

ఆ ఘటన 2016 జరుగుగా విచారణ చేపట్టిన అక్కడి న్యాయస్థానం హత్య చేసిన భారతీయులకి మరణ దండన విధించింది.అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వారికి క్షమా బిక్ష కావాలని వారి తరపున న్యాయవాది షార్జా లోని న్యాయమూర్తికి తెలిపారు…వివరాలలోకి వెళ్తే.


పంజాబ్, హర్యానాకు చెందిన పలువురు భారతీయులు ఉపాధి నిమిత్తం యూఏఈ వెళ్ళారు వారు అందరూ షార్జాలోని అల్ సజా ఇండస్ట్రీయల్ ఏరియాలో నివాసముంటున్నారు.అయితే ఈ క్రమంలో వారు రెండు గ్రూపులుగా విడిపోయారు…తరుచు ఆ రెండు గ్రూపుల మధ్య తగాదాలు వస్తూ ఉండేవి.అయితే ఒక రోజున ఒక గ్రూపు లోని 14 మంది సభ్యులు వేరొక గ్రూపు లోని ఇద్దరినీ దారుణంగా చంపేశారు.దాంతో పోలీసులు ఆ 14 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు.

అయితే

సుదీర్ఘ విచారణ తరువాత కోర్టు వారికి ఉరి శిక్షని ఖరారు చేసింది.దాంతో భారత్‌కు చెందిన డా.ఎస్పీ సింగ్ ఒబెరాయ్ బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించి సాయం చేస్తామని వీరికి క్షమా బిక్ష పెట్టమని అభ్యర్ధించారు.బాధిత కుటుంబాన్ని కూడా కోర్టుకు తీసుకురావడంతో ఇరు వర్గాలు చర్చించుకుని తేల్చుకోవాలని, విచారణను వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి వెల్లడించారు.

అయితే భాదితవర్గం వారు చర్చలకి సిద్దం అని చెప్పడంతో ఆ కుటుంబాలలో సంతోషం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube