సేవ చేసేవారికి గుర్తింపు ఉండాలి.ఆ గుర్తింపు ద్వారా నలుగురికి తెలిసి మరో నలుగురికి స్పూర్తినివ్వాలి.
ఇదే శ్రీ సేవా మార్గ్ సంస్థ చేపడుతున్న కార్యక్రమం.సమాజ సేవకి, స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గించుటకు సంస్థ ద్వారా వినూత్నంగా బకెట్ చాలెంజ్ చేపట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేసి వారి ఉన్నతమైన భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తోంది.
ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఆ సంస్థ అధ్యక్షురాలికి ఆటా ప్రవాసి స్త్రీ శక్తి అవార్డు లభించింది.
అమెరికాలో ఉండే తెలుగు అసోసియేషన్ సభ్యులు అమెరికాలోనే కాకుండా తెలంగాణా లో సైతం ఉచిత విద్య, వైద్యం అందిస్తూ ఎన్నో సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా ప్రతీ సంవత్సరం వరల్డ్ తెలంగాణ కన్వెషన్‌ను అమెరికాలో నిర్వహిస్తుంది…ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన వారిని సత్కరిస్తుంది.
ఈ సంవత్సరం జూన్ 29 నుండి జులై 1 వరకు అమెరికాలోని హూస్టన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అవార్డు అందుకోవడానికి.తెలంగాణలో “సేవా మార్గ్” అనే సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆ సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి ఫణిత చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి సంస్థ ద్వారా జరిగిన వివిధ కార్యక్రమాల గురించి సెమినార్‌లో తెలియచేయవలసిందిగా కోరింది అంతేకాదు ఆమెకి “ప్రవాసీ స్త్రీ శక్తి” అవార్డు కూడా ప్రకటించింది.ఈ మేరకు ఆమెకి ఆహ్వాన పత్రం కూడా పంపింది.ఈ సందర్భంలో అవార్డు కి ఎంపిక అయిన ఫణిత ఆటా టీం సభ్యులకి ధన్యవాదాలు తెలియచేశారు.