ఎప్పుడూ అందరి సంతోషాన్ని కోరుకుంటూ, అందరికి సంతోషాన్ని పంచే జీ తెలుగు ఈసారి మరో సరికొత్త ఈవెంట్ ద్వారా మన ముందుకు వస్తుంది.అదే ‘జీ ఎంటర్టైన్మెంట్ లీగ్’.
ఎంతో ఆసక్తికరమైన కామెడీ స్కిట్స్, స్టార్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన పాటలతో ఈ ఆదివారం మనల్ని అలరించడానికి సాయంత్రం 5 గంటలకు ప్రసారం కాబోతుంది మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్ళలో.
ఈ కార్యక్రమంలో ఎనర్జిటిక్ యాంకర్స్ రవి మరియు శ్యామల తమ యాంకరింగ్‌తో అదరగొట్టేసారు.
తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో పంచ్‌లు వేస్తూ అతిథుల్ని ఆత్మీయంగా ఆహ్వానించారు.ఈ వేదికపై ఫిక్షన్, నాన్- ఫిక్షన్ మధ్య జరిగే సమరం లో స్టార్స్ ఆట పాటలు, మరియు నాన్-ఫిక్షన్ కామెడీ స్కిట్స్ , స రి గ మ ప కంటెస్టెంట్స్ పాటలు అన్నీ కూడా ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తాయి.
రేణు దేశాయ్ ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్.జీ ఎంటర్టైన్మెంట్ లీగ్ సమరంలో గెలిచినవారికి రేణు దేశాయ్ స్వయంగా తన చేతుల మీదుగా అవార్డు అందజేయడం విశేషం.మరి ఎవరు గెలిచారో చూడాలంటే ఈ ఆదివారం జీ ఎంటర్టైన్మెంట్ లీగ్ చూడాల్సిందే.అలాగే ఈ ఈవెంట్ లో నాగభైరవి నటీనటులు తలుక్కుమని మెరవబోతున్నారు.వారి డాన్సులు, మాటలు అభిమానులని ఎంతో ఆకట్టుకుంటాయి.
ఎంతో సరదాగా గడిచిన ఈ వేడుకలో జానీ మాస్టర్ ఫిక్షన్ నటీనటులతో కలిసి ‘బుట్ట బొమ్మ’ పాట మీద స్టెప్స్ వేశారు.
అది తప్పకుండా ప్రేక్షకుల గుండెలు కొల్లగొడుతుందని చెప్పాలి.అలాగే స రి గ మ ప కంటెస్టెంట్ యశస్వి ‘లైఫ్ ఆఫ్ రామ్’ పాట మరొకసారి పాడి అందరి మనసులు మళ్ళీ గెలిచాడు.