అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం లిబియాలో ఏడుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు.దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటన చేసింది.
సెప్టెంబర్ 14న ఈ ఏడుగురు .స్వదేశానికి తిరిగొచ్చేందుకు ట్రిపోలీ విమానాశ్రయానికి బయల్దేరారు.అయితే మార్గమధ్యంలో అశ్వరిఫ్ ప్రాంతంలో సాయుధులైన కొందరు దుండగులు వారిని అడ్డుకుని అపహరించుకుపోయారు.కిడ్నాపర్ల చెర నుంచి భారతీయులను విడిపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు.
కిడ్నాపైన ఏడుగురిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. లిబియాలో బాధితులు పనిచేస్తున్న కంపెనీల ప్రతినిధులు.కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నారని శ్రీవాస్తవ వెల్లడించారు.అయితే కిడ్నాపైన వారి పేర్లు వివరాలు తెలిపేందుకు ఆయన నిరాకరించారు.
వీరంతా అక్కడ భవన నిర్మాణ, చమురు శుద్ధి కార్మాగారాల్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఒకప్పుడు అపార చమురు సంపదతో లిబియా ఒకప్పుడు సంపన్న దేశంగా వుండేది.అయితే నాలుగు దశాబ్దాల ఆయన పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.2011లో గడాఫీ మరణం తర్వాత ఉగ్రవాద తండాలు కొన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటూ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు.