త్వరలో ప్రజా ప్రస్థానం షురూ... కేసీఆర్ టార్గెట్ గానే సాగనున్నదా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మునుపెన్నడూ లేనంతగా సంచలన మలుపులతో ఆసక్తిగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇక షర్మిల కూడా మొదటి నుండి కేసీఆర్ ను ఘాటుగా విమర్శిస్తున్న పరిస్థితుల్లో ఇక ఇది వరకే నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపుగా మార్చి 11 న రెండో విడత పాదయాత్రను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.

 Ys Sharmila Praja Prasthanam Targets Cm Kcr Details,ysrtp Party, Kcr , Sharmila-TeluguStop.com

అయితే ఈ దఫా పాదయాత్ర కూడా కెసీఆర్ టార్గెట్ గానే సాగే అవకాశం ఉంది.అయితే షర్మిల చేస్తున్న ఏ ఒక్క విమర్శకు కూడా టీఆర్ఎస్ లో ఉన్న ఏ ఒక్క నేత నుండి కూడా స్పందన రాలేదన్న విషయం తెలిసిందే.

షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో కెసీఆర్ వ్యతిరేక పంధాను ఎంచుకున్న షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలలో ముఖ్యంగా ఫోకస్ పెట్టే అవాకాశం ఉన్నట్టు తెలుస్తోంది.అయితే రానున్న రోజుల్లో పోటీపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా  పాదయాత్ర ద్వారా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఒక అవగాహనకు వచ్చి ఆ తరువాత అభ్యర్థులపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం కెసీఆర్ ను అడ్డుకోవాలని ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైయస్సార్ టీపీ పార్టీ ఇలా అందరూ భావిస్తున్న పరిస్థితుల్లో దీనిని కెసీఆర్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.ప్రస్తుతం షర్మిలా విమర్శల గురించి స్పందించే అవకాశం లేకున్నా తెర వెనుక జరుగుతున్న విషయాలపై మాత్రం ఒక నివేదిక తెప్పించుకునే అవకాశం అయితే ఉంది.ఏది ఏమైనా ప్రజా ప్రస్థానం పాదయాత్రతో షర్మిల ఎలా రాజకీయ వ్యూహాన్ని ప్రయోగించే అవకాశం ఉందనేది చూడాల్సి ఉంది.

Ys Sharmila Praja Prasthanam Targets Cm Kcr Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube