వైసీపీ అధినేత సీఎం జగన్ దూకుడు పై రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.ఒకపక్క ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న జగన్ మాత్రం ఎక్కడ అ వెనక్కి తగ్గడం లేదు.
ఎంత ఆర్థిక భారం అయినా ఒకదాని తర్వాత మరో సంక్షేమ పథకాన్ని ప్రారంభించుకుంటూ జగన్ తన గుండె ధైర్యం నిరూపించుకుంటున్నారు.గతంలో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ విధంగానే సంక్షేమ పథకాలు అమలు చేసినా అవసరమైన మేరకే పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి, సంక్షేమం రెండిటికి సమ ప్రాధాన్యత ఇచ్చారు.
అప్పుడు ఏపీ తెలంగాణ విభజన జరగకపోవడంతో నిధులకు పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదు.పైగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడంతో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నిధులు సమకూరాయి.

కానీ జగన్ విషయానికొస్తే ఆ సానుకూలతలు లేవు.ఏపీ తెలంగాణ విడిపోవడం లోటు బడ్జెట్ కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అంతంత మాత్రంగా ఉండడం , తోడు ఆర్థిక మాన్యం ఇవన్నీ జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బంది గా మారాయి అయినా జగన్ వరుస వరుసగా పథకాలు ప్రవేశపెట్టి పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇప్పటికే గ్రామ సచివాలయం ఏర్పాట్లు, వాలంటీర్ల నియామకం, లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ, ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం, వైఎస్ఆర్ కంటి వెలుగు రైతు భరోసా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే కనిపిస్తోంది.ప్రతి పథకానికి వేల కోట్లు ఖర్చు అవుతాయి.
మరి వాటికి నిధులు ఎలా సర్దుబాటు చేస్తారు ? ఏపీ ఆర్థిక లోటు ఎలా తీరుస్తారు అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఆ విషయం జగన్ మంత్రి మండలికి తెలిసినా వారు నోరు మెదిపే సాహసం చేయడంలేదు.జగన్ మాత్రం ఎవరు ఏమనుకున్నా ఎంత ఆర్ధిక భారం అయినా తమ అడుగులు ముందుకే తప్ప వెనక్కి కాదన్నట్టుగా వెళ్తున్నారు.ఆర్థిక ఒడిదుడుకులు ఏ స్థాయిలో ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ జగన్ గుండె ధైర్యంతో ముందుకు వెళ్లడం వెనుక ఉన్న రహస్యం అందరికి అంతుబట్టని విషయంగా కనిపిస్తోంది.
ప్రతిపక్షాల నుంచి కూడా దీనిపై సెటైర్లు గట్టిగానే పడుతున్నాయి.