రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు పెన్నిధిగా పేరుగాంచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్( BR Ambedkar ) గౌరవాన్ని మరింతగా పెంచుతూ ఏపీలోని విజయవాడలో ఆయన ప్రతిమ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.భావితరాలకు గుర్తిండి పోయే విధంగా బెజవాడ( Vijayawada ) నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
అనంతరం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేసిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఒకప్పుడు ఎక్కడా చూసినా అంటరానితనమే కనిపించేంది.
సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం ప్రస్తుతం రూపు మార్చుకుందన్నారు.వేర్వేరు రూపాల్లోకి మారుతూ సమాజాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు.
పేద పిల్లలు చదువుకునే స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు.వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే అడ్డుకోవడం కూడా రూపు మార్చుకున్న అంటరానితనమని చెప్పారు.ఆర్టీసీ మొదలు పేద ప్రజలకు వైద్యాన్ని అందించే ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం కూడా అంటరానితనమేనని పేర్కొన్నారు.రాష్ట్రంలో పెరిగిపోయిన పెత్తందారి వ్యవస్థ ఈ అంటరానితనాన్ని కొనసాగిస్తుందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే ఉద్దేశంతో స్కూళ్లల్లో మార్పులు చేసినా.పేద పిల్లలకు ట్యాబ్ లు ఇస్తున్నా అసత్యాలు ప్రచారం చేస్తూ ఎద్దేవా చేయడం అంటరానితనమేనని సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) తెలిపారు.
కొన్ని మీడియా సంస్థలు సైతం వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదగడాన్ని సహించలేకపోతున్నాయని మండిపడ్డారు.పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగానే ఉండిపోవాలా అని ప్రశ్నించారు.
పేదలకు మేలు జరగకూడదని ఆలోచించే విధానం కూడా అంటరానితనమనే చెప్పుకోవచ్చని విమర్శించారు.
అయితే ఏపీలో ఇటువంటి పోకడలు ఇక చెల్లవని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.పేదవారికి అండగా తానున్నానని.ఉంటానని భరోసా కల్పించారు.
బడుగు, బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయ మహాశిల్పం కింద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.అంబేద్కర్ అంటే పెత్తందారులకు అసహ్యమని పేర్కొన్నారు.
దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి టీడీపీ చేసిందేమీ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.పెత్తందారీ నేతలకు, ఆ వ్యవస్థకు దళితులు అంటే చిన్నచూపు, చులకన ఉందన్న ఆయన వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన బాటలోనే నడుస్తుందని స్పష్టం చేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత దక్కిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.శాసనమండలిలో సుమారు 29 మంది సభ్యులు బలహీనవర్గాలకు చెందిన వారే.
వైసీపీ నుంచి మొత్తం ఎనిమిది మంది సభ్యులను రాజ్యసభకు పంపగా వారిలోనూ సగం మంది ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే.అంతేకాదు పదమూడు మంది జెడ్పీ ఛైర్మన్లలో తొమ్మిది మంది బలహీన వర్గాలకు చెందిన వారే.
దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందనే విషయం.
అంతేకాదు ఇకపై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ పేరే గుర్తుకు వస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
సామాజిక చైతన్యవాడలా మారిందంటూ సీఎం వైఎస్ జగన్ ప్రసంగంపై తెలుగు ప్రజలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్న సీఎం వైఎస్ జగనే మరోసారి ఏపీలో అధికార పీఠాన్ని అధిరోహించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలుస్తోంది.